News July 15, 2024

రేపు హస్తినకు సీఎం చంద్రబాబు

image

AP సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం 4 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను CM కలిసే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్, ఇతర అంశాలపై షాతో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 12, 2024

ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు: కేంద్రం

image

దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 21 మంది జడ్జిలు ఉన్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని హైకోర్టులలో 368 ఖాళీలు ఉండగా గరిష్ఠంగా అలహాబాద్ హైకోర్టులో 79 ఉన్నాయని వెల్లడించింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమాధానమిచ్చారు. జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,262 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు.

News December 12, 2024

కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ రాత్రి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీని కూడా సీఎం కలవనున్నారు.

News December 12, 2024

రాజ్యాన్ని కాపాడే సైనిక చీమలు

image

ప్రతి రాజ్యానికి సైనికులున్నట్లే ప్రత్యర్థుల నుంచి పుట్టలను కాపాడేందుకు ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. వీటిని తాబేలు చీమలు లేదా సైనిక చీమలు అని పిలుస్తుంటారు. వీటి ప్రత్యేకమైన తలలే వీటి ఆయుధాలు. రాజ్యంలోకి ఇతర కీటకాలు రాకుండా గూళ్ల ప్రవేశాన్ని మూసేసి వాటిని అడ్డుకుంటాయి. తలను గూడు వద్ద తలుపులా ఫిక్స్ చేస్తాయి. ఏవైనా చీమలు బయటకు వెళ్లాలంటే అవి పక్కకు జరుగుతాయి. ఇవి చొరబాటుదారులను లోపలికి రానివ్వవు.