news

News July 15, 2024

ఢిల్లీ సీఎం బరువుపై జైలు అధికారుల ప్రకటన

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 8.5 కేజీల బరువు తగ్గారన్న ఆప్ నేతల <<13629342>>ఆరోపణల<<>> నేపథ్యంలో తిహార్ జైలు అధికారులు స్పష్టతనిచ్చారు. ఆయన ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3.5 కేజీలు బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పలు తేదీల్లో ఆయన వెయిట్ జాబితాను వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

News July 15, 2024

కేటీఆర్‌కు T కాంగ్రెస్ కౌంటర్

image

TG: రాష్ట్రంలోనూ బస్సు ఛార్జీలు పెంచే అవకాశం ఉందన్న కేటీఆర్ <<13631469>>ట్వీట్‌పై<<>> T కాంగ్రెస్ ఘాటుగా బదులిచ్చింది. ‘మీ తండ్రి దళితులకు మూడెకరాలు భూమి ఫ్రీ, బీసీ బంధు, రైతులకు ఉచితంగా 26 లక్షల టన్నులు ఎరువులు, దళిత బంధు ఫ్రీ, పేదలకు ఉచిత డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తా అన్నాడు. ప్రతి పథకంలో అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకించాడు. పదేళ్ల పాలనను ఎందుకు పదే పదే గుర్తు చేస్తావ్’ అని కేటీఆర్‌కు కౌంటరిచ్చింది.

News July 15, 2024

దూసుకెళ్లిన హెచ్‌సీఎల్ షేర్లు.. మార్కెట్లు ఎలా ఉన్నాయంటే?

image

FY25 తొలి త్రైమాసిక ఫలితాల్లో నికర ఆదాయం పెరగడంతో HCL టెక్ షేర్ల విలువ ఈరోజు ట్రేడింగ్‌లో 4.3% పెరిగింది. ఆరు నెలల్లో 2.2% వృద్ధిని మాత్రమే నమోదు చేసిన ఈ సంస్థ షేర్లు ఇప్పుడు ఈస్థాయిలో పెరగడం పట్ల ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెన్సెక్స్ 80,760 (+241) లాభాలు నమోదు చేయగా నిఫ్టీ తొలిసారిగా 24,600 మార్క్ తాకింది. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ మినహా ఇతర రంగాలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

News July 15, 2024

సైనికుడిగా ప్రభాస్?

image

‘కల్కి’ బ్లాక్ బస్టర్ జోష్‌లో ఉన్న ప్రభాస్ నటించే తర్వాతి సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రాజాసాబ్ సెట్స్‌పై ఉండగా ‘సలార్ 2’తో పాటు సందీప్ వంగా, హను రాఘవపూడి చిత్రాల్లో ఆయన నటించనున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో డార్లింగ్ సైనికుడిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

News July 15, 2024

నేటి నుంచి ఆన్‌లైన్‌లో CMRF దరఖాస్తులు

image

TG: CMRF నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకే అందేలా ప్రభుత్వం నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది. ఈమేరకు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని కేటాయించింది. వారి వద్దకు వెళ్తే పేషెంట్ల వివరాలను CMRF ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా? కాదా? అనే వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్‌లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు.

News July 15, 2024

లోన్లు తీసుకున్నవారికి SBI షాక్

image

బ్యాంకు లోన్లు తీసుకున్న/తీసుకునేవారికి ఎస్బీఐ షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇవాళ్టి నుంచే ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో వెహికల్, హోమ్ లోన్స్ తీసుకున్నవారిపై భారం పడనుంది. ఒక రోజు MCLRకు 8.1%, నెలకు 8.35%, 3 నెలలకు 8.4%, 6 నెలలకు 8.75%, ఏడాదికి 8.85%, రెండేళ్లకు 8.95%, మూడేళ్లకు 9% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

News July 15, 2024

సచివాలయం ముట్టడికి పిలుపు.. నిరుద్యోగుల ముందస్తు అరెస్ట్

image

TG: డీఎస్సీ వాయిదా, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలంటూ హైదరాబాద్‌లో రెండు రోజులుగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగులు ఇవాళ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో వారు రోడ్లపైకి రాకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సెక్రటేరియట్‌ పరిసరాలతో పాటు అక్కడికి వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాగైనా సచివాలయాన్ని ముట్టడిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.

News July 15, 2024

దేవరలో జాన్వీ నెగటీవ్ రోల్?

image

కొరటాల శివ డైరెక్షన్‌లో NTR-జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఓ <<13605580>>డైలాగ్<<>> లీక్ కాగా, మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. జాన్వీ నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుందట. సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

News July 15, 2024

భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘ఏదైనా ఉచితంగా ఇస్తామని అంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లే. ఉచితాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు దూరంలో లేదు’ అని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

News July 15, 2024

రూ.2,289 కోట్ల జీఎస్టీ ఎగవేత.. కఠిన చర్యలకు CM రేవంత్ ఆదేశం

image

TG: జీఎస్టీ చెల్లింపుల్లో బోగస్ పత్రాలతో కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. 13,853 సంస్థల పేరుతో రూ.2,289 కోట్ల జీఎస్టీని ఎగవేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో తేలింది. ఇందులో కేవలం రూ.167 కోట్లే వసూలయ్యింది. దీంతో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా సంస్కరణలు తీసుకురావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తనిఖీల ప్రక్రియను కఠినతరం చేయాలని స్పష్టం చేశారు.