News July 15, 2024

దేవరలో జాన్వీ నెగటీవ్ రోల్?

image

కొరటాల శివ డైరెక్షన్‌లో NTR-జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఓ <<13605580>>డైలాగ్<<>> లీక్ కాగా, మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. జాన్వీ నెగటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్ట్ థ్రిల్లింగ్‌గా ఉంటుందట. సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

Similar News

News October 14, 2024

వెల్లుల్లి తింటే చనిపోయే వ్యాధి గురించి తెలుసా?

image

చాలామందికి వెల్లుల్లి లేకుండా వంట చేయడం కష్టమే. కానీ వెల్లుల్లి పొరపాటున తిన్నా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఓ వ్యాధి ఉందంటే నమ్ముతారా? దీని పేరు ‘అక్యూట్ ఇంటెర్మిటెంట్ పోర్ఫైరా’. వెల్లుల్లిలో అధికంగా ఉండే సల్ఫర్ పడనివారికి ఈ సమస్య వస్తుంది. రోజుల తరబడి వాంతులు, మలబద్ధకం, తీవ్రమైన తలనొప్పి దీని లక్షణాలు. ఇవి ఉన్నవారు వెల్లుల్లి సహా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News October 14, 2024

సాధారణ వైద్య సేవలు బంద్: వైద్యుల సంఘం

image

కోల్‌కతాలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్(FAIMA) పిలుపునిచ్చింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమత నుంచి తమకు సరైన స్పందన రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

News October 14, 2024

ఇప్పుడున్నది పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టు: వాన్

image

పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ దేశం తరఫున క్రికెట్ ఆడుతున్న జట్టు, పాక్ చరిత్రలోనే అత్యంత చెత్త జట్టని తేల్చిచెప్పారు. ‘నాకు తెలిసినంత వరకూ ఇదే అత్యంత వరస్ట్ టీమ్. ఎటువంటి రిస్కులూ లేకుండా ఇంగ్లండ్ చాలా సునాయాసంగా 823 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌‌కు రూట్ ప్రత్యేకమైన ఆటగాడు. కచ్చితంగా సచిన్ రికార్డును బద్దలుగొడతాడు’ అని అంచనా వేశారు.