news

News July 13, 2024

90 శాతం రాయితీతో పశువుల షెడ్ల నిర్మాణం: అచ్చెన్నాయుడు

image

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుపోషకులకు రాయితీపై పశువుల షెడ్లు నిర్మిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గేదెలు, ఆవుల షెడ్లకు 90 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు, గొర్రెలు, మేకల షెడ్లకు 70 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు ఇస్తామని వెల్లడించారు. కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీపై రూ.1.32 లక్షలు అందజేస్తామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు.

News July 13, 2024

గిల్ ‘సెల్ఫిష్’ అంటూ నెటిజన్ల ఫైర్

image

జింబాబ్వేతో 4వ T20లో జైస్వాల్ సెంచరీని గిల్ అడ్డుకున్నాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IND విజయానికి 25రన్స్ కావాల్సిన సమయంలో జైస్వాల్ 83 రన్స్‌ వద్ద ఉన్నారు. కానీ గిల్ అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా 2సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ చేసుకున్నారు. దీంతో గిల్ ‘సెల్ఫిష్’ అంటూ Xలో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే దేశానికి ఆడేటప్పుడు వ్యక్తిగత స్కోర్ చూడటమేంటని గిల్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

News July 13, 2024

‘కల్కి’ని మించిపోయిన కాంగ్రెస్ వసూళ్లు: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు ‘కల్కి’ సినిమా కలెక్షన్లను మంచి పోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేస్తోందన్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలకు ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు. వీరికి రాహుల్ గాంధీ ఏం రేటు ఫిక్స్ చేశారని నిలదీశారు.

News July 13, 2024

పెన్షన్ల రికవరీపై స్పందించిన మంత్రి

image

TG: దాసరి మల్లమ్మకు వృద్ధాప్య పెన్షన్ రికవరీ <<13620026>>నోటీసుపై<<>> మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ‘ANMగా చేస్తూ కుమార్తె చనిపోవడంతో మల్లమ్మకు నెలకు రూ.24,073 కుటుంబ పెన్షన్ వస్తోంది. ఇదే సమయంలో ఆమె వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటోంది. ఒకే వ్యక్తి రెండు పెన్షన్లు పొందడం రూల్స్‌కు విరుద్ధం. 1,826 మంది 2 పెన్షన్లు పొందుతున్నట్లు ట్రెజరీ గుర్తించి నోటీసులిచ్చింది’ అని ఆమె వెల్లడించారు.

News July 13, 2024

ఈ నెల 18 నుంచి సభ్యత్వ నమోదు: జనసేన

image

AP: ఈ నెల 18 నుంచి 28 వరకు 4వ విడత సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో ఈ మహా యజ్ఞం చేపట్టినట్లు పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో జాతీయ స్థాయిలో చర్చించుకునేలా పార్టీ నిలిచిందని గుర్తు చేశారు. అదే ఉత్సాహంతో 9 లక్షల సభ్యత్వాలు నమోదు చేసే లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు.

News July 13, 2024

‘భారతీయుడు-2’ షాకింగ్ కలెక్షన్స్

image

విశ్వనటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘భారతీయుడు-2’ అభిమానుల అంచనాలను చేరుకోలేకపోయింది. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై పడింది. మొదటిరోజు రూ.28.1 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. తమిళంలో రూ.16 కోట్లు, తెలుగులో రూ.8 కోట్లు వచ్చాయట. విక్రమ్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కమల్ ‘భారతీయుడు-2’తో నిరాశపరిచారు. మూవీ మీకెలా అనిపించింది?

News July 13, 2024

సీఎం రేవంత్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే!

image

TG: కాంగ్రెస్‌లో మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే చేరనున్నట్లు తెలుస్తోంది. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాసేపట్లో ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా ఇవాళ ఉదయమే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హస్తం గూటికి చేరారు.

News July 13, 2024

త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ: డీజీపీ

image

AP: త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తాం. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News July 13, 2024

IPL.. ఆ జట్టు సంచలన నిర్ణయం

image

IPLలో DC జట్టుకు 2016 నుంచి హెడ్ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌ను తొలగించింది. గత కొన్ని సీజన్లుగా జట్టు ఆశించినట్లుగా రాణించకపోవడం, 2024 సీజన్‌ను 6వ స్థానంతో ముగించడంతో పాంటింగ్‌తో కాంట్రాక్ట్‌ను ముగించింది. ఇన్నేళ్ల పాటు జట్టుకు సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపింది. అటు తదుపరి సీజన్‌కు తానే కోచ్‌గా ఉంటానని, ఛాన్స్ ఇవ్వాలని DC డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ మేనేజ్‌మెంట్‌కు చెప్పారట.

News July 13, 2024

డెడ్ స్టోరేజీ దిగువకు నాగార్జున సాగర్

image

తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ దిగువకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 503 అడుగులకు పడిపోయింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడమే ఇందుకు కారణం. కాగా కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్ త్వరలోనే నిండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్మట్టి నుంచి దిగువకు నీరు విడుదల చేస్తే శ్రీశైలంతోపాటు సాగర్ కూడా నిండనుంది.