news

News July 13, 2024

పురపాలికల్లో అభివృద్ధే కనిపించడం లేదు: ఎంపీ రమేశ్

image

AP: వైసీపీ హయాంలో కడప ఉక్కు పరిశ్రమ ఒక్క శాతం కూడా పూర్తి కాలేదని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు. గడిచిన ఐదేళ్లు జగన్ తన సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని పురపాలికల్లో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి వసూళ్లపై ప్రజలు ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి వచ్చేలా చేస్తామన్నారు. కడప జిల్లాలో భూ దందాలపై విచారణ చేయిస్తామన్నారు.

News July 13, 2024

ఈ ఫ్యాన్సీ నంబర్‌కు రూ.6,00,999

image

TG: వాహనాల నంబర్ ప్లేట్ల వేలంలో నిన్న సికింద్రాబాద్ ఆర్టీఓకు రూ.18.28లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా TG 10 9999 నంబర్‌ రూ.6,00,999 పలికింది. దీని కోసం ఐదుగురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ తర్వాత TG 10A 0001కు రూ.3.60లక్షలు, TG 10A 0009 రూ.2.61లక్షలు పలికాయి. కాగా గతంలో నిర్వహించిన TG సిరీస్‌లో ఫస్ట్ నంబర్ TG 09 0001కి రూ.9.61లక్షలు పలికింది.

News July 13, 2024

వర్షాకాలం.. ఈ జాగ్రత్తలు పాటించండి!

image

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండి.
* స్ట్రీట్ ఫుడ్‌ కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. దానికి దూరంగా ఉండండి.
* ఇంటిని తరచూ శుభ్రం చేసుకోండి.
* కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహారం తీసుకోండి.
* సీ ఫుడ్‌‌కు కాస్త విరామం ఇవ్వడం మంచిది.
* వర్షంలో తడిస్తే తప్పనిసరిగా స్నానం చేయండి.
>> SHARE

News July 13, 2024

రెడ్ బుక్ కాదు.. హామీలు అమలు చేయండి: అంబటి

image

AP: వైసీపీ శ్రేణులపై దాడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మేనిఫెస్టోలోని అంశాలపై కాకుండా రెడ్‌ బుక్‌పైనే చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టి పెట్టారని ఆరోపించారు. ‘రెడ్ బుక్‌ని కాదు, మేనిఫెస్టోని అమలు చేయండి’ అని Xలో విమర్శించారు.

News July 13, 2024

OFFICIAL: ‘కల్కి’ కలెక్షన్లు రూ.1000 కోట్లు

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా జూన్ 27న రిలీజవగా ఇప్పటివరకూ రూ.1000 కోట్లు కలెక్ట్ చేసినట్లు నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ‘మా సినిమాపై మీరు కురిపించిన ప్రేమతో ఈ మైలురాయిని చేరుకున్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని తెలిపింది. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

News July 13, 2024

విశ్వక్రీడలను ‘జియో సినిమా’లో ఫ్రీగా చూసేయండి!

image

పారిస్ ఒలింపిక్స్-2024 ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా ప్రత్యక్ష ప్రసారాన్ని ‘జియో సినిమా’లో ఉచితంగా చూడొచ్చు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా యూజర్లను పెంచుకుని 150 మిలియన్ వ్యూస్‌ని చేరుకోవచ్చని జియో అంచనా వేస్తోంది. టీవీలో స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌లో చూడొచ్చు. ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ కొనసాగనుండగా.. మన దేశ టైమింగ్ ప్రకారం రోజూ ఉదయం 11 గంటలకు గేమ్స్ స్టార్ట్ అవుతాయి.

News July 13, 2024

సంచలనం.. వారి నుంచి ఆసరా పెన్షన్లు వెనక్కి!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొందరు రిటైరైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ట్రెజరరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్‌, మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది. ఇందులో భాగంగా 2017 నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధురాలి(<<13620026>>ఖమ్మం<<>>)కి రూ.1.70 లక్షలు తిరిగివ్వాలని అధికారులు నోటీసులిచ్చారు.

News July 13, 2024

ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: అలీ ఫజల్

image

తాను నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని మీర్జాపూర్ సిరీస్ నటుడు అలీ ఫజల్ అన్నారు. తానొక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌నని.. దేశం తరఫున ఆడాలనేది తన లక్ష్యంగా ఉండేదని తెలిపారు. అయితే స్కూల్ డేస్‌లో భుజానికి అయిన తీవ్ర గాయం కారణంగా ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని అన్నారు. ఆ తర్వాత నటనవైపు అడుగులు వేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News July 13, 2024

రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు: RSP

image

రఘురామకృష్ణ రాజును వేధించారనే ఆరోపణలతో ఏపీ మాజీ CM జగన్, సీనియర్ IPS అధికారులు సునీల్ కుమార్, అంజనేయులుపై FIR నమోదవ్వడం షాక్‌కు గురిచేసిందని RSP ట్వీట్ చేశారు. దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారన్నారు. గోధ్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారని గుర్తుచేశారు. సీనియర్ అధికారులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News July 13, 2024

రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అంత ప్రమాదమా?

image

వీటితో కృత్రిమ విపత్తులు సృష్టించవచ్చు. ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్‌తో మంచు పర్వతాలను కరిగిస్తే ఫలితంగా కొండ చరియలు విరిగిపడి నదులు ఉప్పొంగి మానవులకు ప్రమాదం ఏర్పడుతుంది. అటామిక్ ఎనర్జీ చట్టం 1962 ప్రకారం అనుమతి లేకుండా ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వాడటం చట్టవిరుద్ధం. తాజాగా డెహ్రాడూన్‌లో యాక్టివ్ మెటీరియల్స్‌ పట్టుబడటం దేశంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రలో భాగమేననే అనుమానం వ్యక్తమవుతోంది.