News July 13, 2024

రాజకీయ కుట్రలకు అధికారులు బాధితులు: RSP

image

రఘురామకృష్ణ రాజును వేధించారనే ఆరోపణలతో ఏపీ మాజీ CM జగన్, సీనియర్ IPS అధికారులు సునీల్ కుమార్, అంజనేయులుపై FIR నమోదవ్వడం షాక్‌కు గురిచేసిందని RSP ట్వీట్ చేశారు. దేశంలో రాజకీయ కుట్రలకు నిజాయితీ గల అధికారులు బాధితులు అవుతున్నారన్నారు. గోధ్రా మారణహోమంలో న్యాయం వైపు నిలిచిన సంజీవ్ భట్ ఏళ్లుగా జైళ్లోనే ఉన్నారని గుర్తుచేశారు. సీనియర్ అధికారులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News February 13, 2025

పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.

News February 13, 2025

ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు

image

‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్‌’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.

News February 13, 2025

BREAKING: తోటి సిబ్బందిపై CRPF జవాన్ ఘాతుకం

image

మణిపుర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంజయ్ కుమార్ అనే CRPF జవాన్ తన సర్వీస్ తుపాకీతో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు చనిపోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం తనను తాను కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

error: Content is protected !!