India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూపీలో ఓ వ్యక్తి పదే పదే పాముకాటుకు గురవుతుండటంతో <<13618835>>పాము<<>> పగ గురించి చర్చ నడుస్తోంది. పాము పగకు శాస్త్రీయ ఆధారం లేదు. మనిషి వాటికి ఆహారం కాదు కనుక హాని జరుగుతుందనిపిస్తే తప్ప కాటేయవు. బాధితుడు వేరే ఊరు వెళ్లినా కాటుకు గురయ్యానంటున్నాడు కాబట్టి కరిచింది ఒకే పాము కాకపోవచ్చు. ఇన్నిసార్లు కరిచినా బతికి బట్టకట్టాడు కాబట్టి విషపూరితమైనవి కూడా కాకపోవచ్చు. మరి ఎందుకు అతడిని వెంటాడుతున్నాయి? (1/2)
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,493 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.69 కోట్లు సమకూరింది.
వింబుల్డన్(టెన్నిస్) మహిళా సింగిల్స్‌లో ఇవాళ తుదిపోరు జరగనుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో క్రెజికోవా(చెక్ రిపబ్లిక్), పావోలిని(ఇటలీ) తలపడనున్నారు. వీరిద్దరు వింబుల్డన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. క్రెజికోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలవగా, పావోలిని ఖాతాలో ఒక్క గ్రాండ్‌స్లామ్ లేదు. 2016లో సెరెనా ట్రోఫీ గెలిచాక ప్రతి వింబుల్డన్‌లోనూ కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నారు. ఈసారీ అదే ఆనవాయితీ కొనసాగుతోంది.
TG: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి) ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.
TGSRTC బస్ టికెట్లను తన ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయించేందుకు వాట్సాప్ యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని వాట్సాప్ బిజినెస్ ఇండియా హెడ్ రవి గార్గ్ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టికెట్లు వాట్సాప్‌లో బుక్ చేసుకునే వీలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే <<13612357>>యూపీఐ<<>> ద్వారా బస్సుల్లో టికెట్లు విక్రయించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. నిన్న రెండు సెమీఫైనల్స్ జరగ్గా ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్, మరో మ్యాచులో వెస్టిండీస్‌పై పాకిస్థాన్ గెలిచాయి. ఈ రోజు రాత్రి.9గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్1 హిందీలో చూడవచ్చు.
> All The Best India Champions
TG: రైతులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రైతు భరోసా రాదేమోనని భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు భరోసా అమలుపై వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘రుణమాఫీని ఆగస్టులో చేస్తాం. దీని వల్ల పెట్టుబడి సాయం కొంచెం ఆలస్యం కావొచ్చు. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం జరిగితే రూ.10వేల వరకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.
AP: గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 27.040 మీటర్లకు నీటిమట్టం చేరింది. 48 గేట్ల నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నది నుంచి సుమారు 50వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జైలుకు పంపడమే తన లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఆయన్ను గద్దె దించాలన్న ఓ లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని మీడియా సమావేశంలో తెలిపారు. ‘మిగులు బడ్జెట్‌తో మొదలైన రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారు. ప్రతీ శాఖను అవినీతిమయం చేశారు. అందుకే బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ సమాధైనట్లే’ అని వ్యాఖ్యానించారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ క్రమంలో పెళ్లి కూతురు రాధిక వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు వర్ణాల్లో మెరుస్తున్న ఈ గుజరాతీ సంప్రదాయ లెహంగాను అబుజనీ సందీప్ ఖోస్లా రూపొందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవాళ అనంత్-రాధిక రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకల కోసం దేశ, విదేశాల నుంచి సెలబ్రిటీలు ముంబై చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.