News July 13, 2024
కొత్త ఛాంపియన్ ఎవరో?

వింబుల్డన్(టెన్నిస్) మహిళా సింగిల్స్‌లో ఇవాళ తుదిపోరు జరగనుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి జరిగే ఫైనల్లో క్రెజికోవా(చెక్ రిపబ్లిక్), పావోలిని(ఇటలీ) తలపడనున్నారు. వీరిద్దరు వింబుల్డన్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. క్రెజికోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలవగా, పావోలిని ఖాతాలో ఒక్క గ్రాండ్‌స్లామ్ లేదు. 2016లో సెరెనా ట్రోఫీ గెలిచాక ప్రతి వింబుల్డన్‌లోనూ కొత్త ఛాంపియన్ పుట్టుకొస్తున్నారు. ఈసారీ అదే ఆనవాయితీ కొనసాగుతోంది.
Similar News
News February 14, 2025
విశ్వక్‌సేన్ ‘లైలా’ పబ్లిక్ టాక్

విడుదలకు ముందే రాజకీయ వివాదాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ‘లైలా’ సినిమా ప్రీమియర్ షోలు USలో ప్రారంభమయ్యాయి. సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టారని, సినిమా అంతా వన్ మ్యాన్ షో అని ప్రశంసిస్తున్నారు. అయితే స్టోరీ ఔట్‌డేటెడ్ అని, ఇంట్రెస్టింగ్ సీన్లు లేవని కొందరు పెదవి విరుస్తున్నారు. పూర్తి రివ్యూ, రేటింగ్ మరికొన్ని గంటల్లో..
News February 14, 2025
రంజీ సెమీస్‌లో ఆడనున్న జైస్వాల్

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయిన టీమ్‌ఇండియా ఓపెనర్ జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఆడనున్నారు. ఈనెల 17 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో మ్యాచులో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. తొలుత ప్రకటించిన CT జట్టులో జైస్వాల్ పేరు ఉన్నప్పటికీ తర్వాత అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. జైస్వాల్‌ను నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్స్ లిస్టులో చేర్చారు. అతడు జట్టుకు అవసరమైనప్పుడు దుబాయ్ వెళ్తారు.
News February 14, 2025
రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11.45కు ఆయన కందుకూరు TRR కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.