India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐఐటీయన్ల వేతనాల్లో భారీ కోత పడుతోందని డెలాయిట్, టీమ్‌లీజ్ సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది. ఒకప్పుడు ఏడాదికి సగటున రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉన్న ప్యాకేజీ ఇప్పుడు రూ.15 లక్షలు దాటడమే కష్టంగా మారింది. IITల్లో చదివిన వారిలో దాదాపు 40% మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగాలు దక్కట్లేదట. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, IT కాదని ఎలక్ట్రిక్ వెహికల్ రంగాల్లో పెట్టుబడులు కారణమని తెలుస్తోంది.
AP: అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు <<13579211>>సురేశ్<<>> ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే ఆమెను హతమార్చినట్లు తెలుస్తోంది.
TG: వైద్య సేవల్లో కీలకంగా ఉన్న వైద్య విధాన పరిషత్ రద్దుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు చేయనుందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుందట. ప్రతి 30KMల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వై.వి.ప. పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి.
టాటా, మహీంద్రా కంపెనీలు పలు మోడళ్ల కార్లపై 8% వరకు ధరలను తగ్గించాయి. మహీంద్రా XUV700 AX7 డీజిల్ కారు ధర ఏకంగా రూ.23.69 లక్షల నుంచి రూ.21.59 లక్షలకు చేరింది. టాటా హారియర్ ప్యూర్ + కారు ధర రూ.1.20 లక్షలు తగ్గింది. కంపెనీల వద్ద అమ్ముడుపోని కార్ల నిల్వలు భారీగా పెరగడంతోనే ఈ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.60వేల కోట్ల విలువైన 6 లక్షల కార్లు కంపెనీల వద్దే ఉండిపోయాయట.
AP: వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ MLA <<13595152>>కేటీఆర్<<>>కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. YCP పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు.
టీ పొడిలో పురుగుమందులు, ఎరువుల ఆనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్‌మెంట్ గుర్తించిందట. ఇప్పటికే మంచూరియా, కబాబ్, పీచు మిఠాయిల్లో కలరింగ్ ఏజెంట్లను నిషేధించింది. తాజాగా టీ స్టాళ్లపై దృష్టిపెట్టిన అధికారులు పలు జిల్లాల నుంచి టీపొడి శాంపిల్స్ పరిశీలించారట. మంచి రంగు కోసం టీడస్ట్ ప్రాసెసింగ్‌లో లిమిట్‌కి మించి పురుగుమందులు, ఎరువులు వాడుతున్నట్లు కనుగొన్నారని సమాచారం. అది క్యాన్సర్‌కు దారి తీస్తుందట.
AP: బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత కోచింగ్‌కు ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% EWS రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఒక్కో ఉమ్మడి జిల్లాలో ఉన్న 200 సీట్లకు అదనంగా 10శాతం(20 సీట్లు) పెంచనున్నారు. ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలోనే EWS సీట్లకు అప్లికేషన్లు స్వీకరించే అవకాశం ఉంది. మరోవైపు డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చాక కోచింగ్ ప్రారంభిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.
AP: కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు. ప్లాంట్ పనితీరు, ఆర్థిక పరిస్థితులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. నిన్న సాయంత్రమే ఆయన విశాఖ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తల నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దేవర’ నుంచి ఓ డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల డబ్బింగ్ ప్రారంభించగా ఈ డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
హలాల్ గుర్తింపు పొందిన ఉత్పత్తులను రైల్వేశాఖ ప్రయాణికులకు సరఫరా చేస్తోందని జరుగుతున్న ప్రచారంపై IRCTC స్పందించింది. ఎవరూ దీన్ని నమ్మవద్దని, సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. ఫుడ్ సప్లయ్ కోసం తమకు కేవలం FSSAI సమ్మతి మాత్రమే అవసరమని స్పష్టం చేసింది. హలాల్ చేసిన ఆహార ఉత్పత్తులను తనకు సప్లయ్ చేశారంటూ ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరలవగా IRCTC ఇలా స్పందించింది.
Sorry, no posts matched your criteria.