News July 11, 2024
SHOCK: టీలో పురుగుమందులు, ఎరువులు!

టీ పొడిలో పురుగుమందులు, ఎరువుల ఆనవాళ్లను కర్ణాటక హెల్త్ డిపార్ట్‌మెంట్ గుర్తించిందట. ఇప్పటికే మంచూరియా, కబాబ్, పీచు మిఠాయిల్లో కలరింగ్ ఏజెంట్లను నిషేధించింది. తాజాగా టీ స్టాళ్లపై దృష్టిపెట్టిన అధికారులు పలు జిల్లాల నుంచి టీపొడి శాంపిల్స్ పరిశీలించారట. మంచి రంగు కోసం టీడస్ట్ ప్రాసెసింగ్‌లో లిమిట్‌కి మించి పురుగుమందులు, ఎరువులు వాడుతున్నట్లు కనుగొన్నారని సమాచారం. అది క్యాన్సర్‌కు దారి తీస్తుందట.
Similar News
News February 16, 2025
చికెన్ మార్కెట్.. ఆదివారం ఆదుకునేనా?

చాలా ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే బర్డ్ ఫ్లూ భయాందోళనలతో గత కొన్ని రోజులుగా చికెన్, గుడ్డు తినడాన్ని చాలామంది తగ్గించేశారు. ప్రమాదం లేదని ప్రభుత్వమే చెబుతున్నా ప్రజలు భయపడుతున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. మరి ఆదివారమైనా ప్రజలు తిరిగి చికెన్ వైపు చూస్తారా లేక ఇతర నాన్ వెజ్ ఆప్షన్లను ఎంచుకుంటారా? చూడాలి.
News February 16, 2025
ఫ్యాన్స్‌కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం?

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ ఏడాది విశ్వంభరను దించేందుకు సిద్ధమవుతున్న ఆయన, వచ్చే ఏడాది ముగిసేలోపు మరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో సినిమాల్ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలోపు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.
News February 16, 2025
రేపు భారత్‌కు ఖతర్ అమీర్

ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్-థనీ రేపు, ఎల్లుండి భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అమీర్ భారత్‌కు వస్తున్నారని.. రాష్ట్రపతి, PM మోదీతో ఆయన భేటీ అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని పేర్కొంది. 2015 మార్చిలో ఆయన తొలిసారి భారత్‌లో పర్యటించగా ఇది రెండో పర్యటన అని వెల్లడించింది.