India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫ్రాన్స్‌లో లెఫ్ట్ వింగ్‌కు చెందిన న్యూ పాపులర్ ఫ్రంట్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతుండటంతో ఆ దేశంలో అమలు కానున్న పాలసీలపై ఆసక్తి నెలకొంది. 4లక్షల యూరోల (₹3.6కోట్లు) కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిపై 90% ట్యాక్స్ విధిస్తామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయసు 60కి పరిమితం చేయడం, ఇంధన ధరల నియంత్రణ, కనీస వేతన పెంపు మొదలైన అంశాలను కూడా హామీల్లో పేర్కొంది.
TG: జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రీజినల్ రింగ్ రోడ్డు(RRR) భూసేకరణలో పురోగతిపై ఆయన ఆరా తీశారు. మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణ వివరాలు నెలాఖరులోగా పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
FY14 (2013-14) నుంచి FY23 మధ్య భారత్ 12.5కోట్ల ఉద్యోగాలు సృష్టించినట్లు SBI వెల్లడించింది. FY04-14 మధ్య ఈ సంఖ్య 2.9కోట్లకే పరిమితం అయిందని తెలిపింది. మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో FY04-14 మధ్య 6.6కోట్ల ఉద్యోగాలు రాగా FY14-23 మధ్య ఆ సంఖ్య 8.9కోట్లుగా ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది. కాగా MSMEల్లో రిజిస్టర్ అయిన ఉద్యోగాల సంఖ్య 20కోట్లు దాటినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.
AP: సీఎం చంద్రబాబుతో బీపీసీఎల్ ఛైర్మన్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుమారు రూ.60 వేల కోట్లతో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. కాగా బీపీసీఎల్ ప్రాజెక్ట్ వస్తే 25వేల మందికి ఉపాధి లభిస్తుందని ఎంపీ బాలశౌరి తెలిపారు.
TG: ఎంపీ టికెట్ల విషయంలో తనకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు వాపోయారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే తాను గెలిచేవాడినని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. క్రీడలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించి ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సూచీలు సరికొత్త గరిష్ఠాలను చేరితే ఆ ప్రాఫిట్స్ మిస్ అయిపోతామేమోనని కొత్త ఇన్వెస్టర్లు భావిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోళ్లు కొనసాగిస్తే మార్కెట్‌లో కరెక్షన్ వచ్చినప్పుడు తమ షేర్ల బయింగ్ కాస్ట్ యావరేజ్ తగ్గుతుందనే అభిప్రాయం వారిలో ఉందన్నారు. ఇన్వెస్టర్లు మార్కెట్లో పెట్టుబడికి ఆకర్షితులు కావడానికి ఇవే కారణాలని తెలిపారు. దీంతో పెట్టుబడులు పెరిగి మార్కెట్ విస్తరిస్తోందన్నారు.
భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ రేసులో మాజీ పేసర్లు జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బ్యాటింగ్ కోచ్‌గా దాదాపు అభిషేక్ నాయర్ పేరు ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. బౌలింగ్ కోచ్ బాధ్యతలు ఎవరు చేపడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ ద్వారా తెలియజేయండి.
TG: 2018లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న BRS నేత కేటీఆర్.. ఫిరాయింపులు చట్టవిరుద్ధమని మాట్లాడుతున్నారు. ఆ 12 మంది స్వచ్ఛందంగా పార్టీని విలీనం చేశారని, ఇప్పుడు రేవంత్ తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని ప్రతిపక్ష నేతగా గర్జించిన రేవంత్.. ఇప్పుడు చేరికలను ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ ఫిరాయింపు రాజకీయాలపై మీ కామెంట్?
TG: అర్హులైన వారికే రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సంపన్నులు, పన్నులు కట్టేవారిని పథకం నుంచి తొలగించాలని సూచించారు. రైతు భరోసా నుంచి వ్యవసాయం చేయని భూములు తొలగించాలన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల CMల మధ్య చర్చలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని చెప్పారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టారని తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ BJP MLA శైలా రావత్(68) మృతి చెందారు. వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆమె కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. శైలా 2012లో తొలిసారి కాంగ్రెస్ నుంచి MLA అయ్యారు. 2016లో అప్పటి CM హరీశ్ రావత్‌కు వ్యతిరేకంగా మారి BJPలో చేరారు.
Sorry, no posts matched your criteria.