news

News July 10, 2024

చైనా మా సమాచారాన్ని చోరీ చేస్తోంది: ఆస్ట్రేలియా

image

హ్యాకర్ బృందాల ద్వారా చైనా తమ సమాచారాన్ని తస్కరిస్తోందని ఆస్ట్రేలియా తాజాగా ఆరోపించింది. యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్‌ను దొంగిలిస్తున్నారని ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘చైనా హ్యాకింగ్ బ‌ృందాలు మా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల సమాచారాన్ని చోరీ చేస్తున్నాయి. వాటి వల్ల మా నెట్‌వర్క్స్‌కు, సైబర్ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేసింది.

News July 10, 2024

రేపటి నుంచి వెబ్‌సైట్‌లోకి డీఎస్సీ హాల్ టికెట్లు

image

TG: ఈ నెల 18 నుంచి వచ్చే నెల 5 వరకు ఆన్‌లైన్‌లో జరిగే డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. www.schooledu.telangana.gov.in సైట్ నుంచి అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మొత్తం 11,062 పోస్టుల భర్తీకోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News July 10, 2024

దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు

image

ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం బాగుండటంతో ఖరీఫ్ విస్తీర్ణం బాగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం.. పప్పుధాన్యాలు, నూనెగింజలు, వరిపంట సాగు బాగుంది. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే బాగా 14శాతం పెరిగాయి. విడిగా చూస్తే.. వరిసాగు గత ఏడాదితో పోలిస్తే 20శాతం, పప్పుధాన్యాలు, నూనెగింజలు విత్తిన ప్రాంతం 55శాతం, పత్తి, చెరకు సాగు 29శాతం మేర పెరిగింది.

News July 10, 2024

ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి భారత్‌కు ఉంది: అమెరికా

image

ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపాలని మరోమారు అమెరికా భారత్‌ను పరోక్షంగా కోరింది. శ్వేత సౌధ అధికార ప్రతినిధి కరీన్ జీన్ పియరీ ప్రెస్‌మీట్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘భారత్‌కు, రష్యాకు మంచి సంబంధాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా పుతిన్‌ను ఒప్పించేందుకు ఆ బంధం ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు. యుద్ధంలో అమాయకులైన చిన్నారులు కన్నుమూయడం పట్ల మోదీ తన ఆవేదనను పుతిన్ వద్ద వ్యక్తీకరించిన సంగతి తెలిసిందే.

News July 10, 2024

భోలే ఆశ్రమంలోకి లేడీస్‌కు మాత్రమే ఎంట్రీ?

image

‘హాథ్రస్‌’ భోలే బాబా గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని ఖేడ్లీ టౌన్‌ సమీపంలో సహజపూర్ గ్రామంలో అతడికో ఆశ్రమం ఉంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు ఉండే ఆ ఆశ్రమంలో స్థానికులకు, పురుషులకు ఎంట్రీ లేదని.. స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంటుందని వారు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు అనుమతి లేకుండా లోపలికి వెళ్తే సిబ్బంది దాడి చేస్తారని గ్రామస్థులు చెబుతుండటం గమనార్హం.

News July 10, 2024

వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయండి: WHO

image

వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తాజాగా సూచించింది. 300 నిమిషాల వరకు ఎక్స‌ర్‌సైజులకు కేటాయించాలని పేర్కొంది. ఐదేళ్ల వయసు మొదలు అన్ని రకాల వయసుల వారికి పలు సిఫారసులను చేసింది. తగినంత వ్యాయామం చేయనివారిలో దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు చాలా ఎక్కువ అని స్పష్టం చేసింది. ప్రధానంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వివరించింది.

News July 10, 2024

ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీ

image

రష్యాలో 2రోజుల పర్యటన ముగించుకున్న PM మోదీ ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు వియన్నాలో ల్యాండ్ అయ్యాను. ఆస్ట్రియాకు చేపడుతున్న ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. ఇరు దేశాలు ఉమ్మడి విలువలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడి భారత ప్రజలు, ఛాన్సలర్‌ను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు.

News July 10, 2024

పూరీ రత్నభాండాగారాన్ని తెరిచేది ఎప్పుడంటే..

image

పూరీ జగన్నాథుడి ఆలయం కింద రత్నభాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు రథ్ తెలిపారు. ‘ఈ 14న గదిని తెరిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. ముందుగానే గది తాళం ఇవ్వాలని క్షేత్ర పాలనాధికారికి చెప్పాం. రథయాత్ర కారణంగా అది సాధ్యం కాలేదు. మా నిర్ణయాలను ఆలయ కమిటీకి పంపుతాం. వారు ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు’ అని తెలిపారు.

News July 10, 2024

నాకు ఇంటి ఫుడ్ కావాలి: దర్శన్

image

తన అభిమానిని హత్య చేసిన ఆరోపణలతో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ తాజాగా కర్ణాటక హైకోర్టుకు పలు విజ్ఞప్తులు చేశారు. ఇంట్లో తయారు చేసిన ఆహారం కావాలని, అదే విధంగా తన ఇంట్లో ఉన్న పుస్తకాలు, పరుపును తెప్పించాలని అడిగారు. ఆయన తరఫున అడ్వకేటు ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేయాలని కోరారు. త్వరలోనే కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

News July 10, 2024

సాంగ్‌ను సిరివెన్నెల సిగరెట్ పెట్టెపై రాశారు: కృష్ణవంశీ

image

సింధూరంలో ‘అర్థశతాబ్దపు’ పాటను సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఓ సిగరెట్ పెట్టెపై రాశారట. ఆ మూవీ దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ‘మూవీ ఫస్ట్ కాపీ చూశాక అటూ ఇటూ తిరుగుతున్నారు. ఏంటి గురువుగారూ అని అడిగితే పేపర్ ఇమ్మన్నారు. చేతిలో ఏం లేక రోడ్డుపై సిగరెట్ పెట్టెను తీసి ఇచ్చాను. దాని మీద లిరిక్స్ రాసి గంటలో పాట ఇచ్చారు. ఆయన చెప్పడం వల్లే ఈ పాట సినిమాలో పెట్టాం’ అని పేర్కొన్నారు.