News July 10, 2024
ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీ
రష్యాలో 2రోజుల పర్యటన ముగించుకున్న PM మోదీ ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు వియన్నాలో ల్యాండ్ అయ్యాను. ఆస్ట్రియాకు చేపడుతున్న ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. ఇరు దేశాలు ఉమ్మడి విలువలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడి భారత ప్రజలు, ఛాన్సలర్‌ను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News October 6, 2024
18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!
అధిక రాబడులు ఆశచూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెరల్ ఆగ్రో కార్పొరేషన్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
News October 6, 2024
ఈ పండును తిన్నారా?
విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.
News October 6, 2024
ప్రకాశ్ రాజ్‌కు నిర్మాత కౌంటర్
TN డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కూర్చున్న ఫొటో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్‌కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే, మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీ మధ్య తేడా. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇంతవరకు చేయలేదు’ అని ట్వీట్ చేశారు. ఈయన ప్రకాశ్ రాజ్‌తో ‘ఎనిమీ’ మూవీ తీశారు.