news

News July 9, 2024

58 బంతుల్లో సెంచరీ చేసిన డుప్లెసిస్

image

యూఎస్ వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్(MCL)లో టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీ బాదారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో జరిగిన మ్యాచులో 58 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. డుప్లెసిస్ ఇన్నింగ్సులో 12 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో టెక్సాస్ 203 పరుగులు చేసింది. ఛేదనలో ఫ్రీడమ్ జట్టు 4 ఓవర్లలో 62 పరుగులు చేయగా వర్షం కురవడంతో మ్యాచ్ రద్దైంది.

News July 9, 2024

అమెరికాలో నలుగురు తెలుగువారు అరెస్ట్

image

USలోని టెక్సాస్‌లో మానవ అక్రమరవాణా కేసులో నలుగురు తెలుగువారు అరెస్ట్ అయ్యారు. కొలిన్ కౌంటీలోని ప్రధాన నిందితుడు సంతోష్ కట్కూరి నివాసంలో 15 మంది మహిళలను ప్రిన్‌స్టన్ పోలీసులు గుర్తించారు. సంతోష్, సతీమణి ద్వారకా వీరిని తమ షెల్ కంపెనీలకు పనిచేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కేసులో చందన్, అనిల్ అనే మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ర్యాకెట్‌లో 100 మందికిపైగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

News July 9, 2024

అవసరమైతే ఆడేందుకు సిద్ధమే: వార్నర్

image

ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే జట్టు ప్రయోజనాల కోసం వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని చెప్పారు. ‘కొంత కాలం ఫ్రాంచైజీ క్రికెట్‌ను కొనసాగిస్తాను. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైతే తప్పకుండా ఆడేందుకు సిద్ధమే’ అని ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు తన వారసుడిగా మెక్‌గుర్క్‌ను వార్నర్ ఇప్పటికే ప్రకటించారు.

News July 9, 2024

మంచు ఫ్యామిలీలో గొడవ?

image

మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్ధలున్నాయనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మనోజ్ కూతురు నామకరణ కార్యక్రమంలో విష్ణు కనిపించకపోవడమే దీనికి కారణమైంది. అంతేకాదు చిన్నారి పేరును ప్రకటిస్తూ విడుదల చేసిన నోట్‌లోనూ విష్ణు పేరు లేదు. తల్లిదండ్రులతో పాటు సోదరి మంచు లక్ష్మి, భూమా ఫ్యామిలీ మెంబర్ల పేర్లను మెన్షన్ చేసిన మనోజ్.. విష్ణు పేరును మాత్రం అందులో పేర్కొనలేదు.

News July 9, 2024

అమెరికాలో ప్రణీత్ హనుమంతు!

image

తండ్రీకూతుళ్లపై అసభ్యకర కామెంట్లు చేసిన కంటెంట్ క్రియేటర్ ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం సాయంత్రం అతడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రణీత్‌తో పాటు అతడి బ్యాచ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అతడిపై TG ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

News July 9, 2024

35 రోజుల్లో 6 సార్లు పాము కాటు!

image

యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వికాస్ దూబే(24) అనే వ్యక్తిని 35 రోజుల వ్యవధిలో 6 సార్లు పాములు కాటేశాయి. గత నెల 2న తొలి కాటు మొదలు 4సార్లు పాము కరిచాక భయంతో మేనత్త ఊరికి వెళ్లిపోయాడు. అక్కడా కాట్లు తప్పలేదు. ఈ నెల 6న ఆరోసారి పాము కరిచింది. కాటు పడిన ప్రతిసారీ వెంటనే ఆస్పత్రికి తరలించడంతో బతికి బట్టకట్టాడు. కాటేసింది ఒకటే సర్పమా లేక వేర్వేరు సర్పాలా అన్నది తెలియాల్సి ఉంది.

News July 9, 2024

రష్యా ఆర్మీ నుంచి భారతీయులకు విముక్తి?

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో పలువురు భారతీయులను రష్యా తన ఆర్మీలో వాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధాని మోదీతో చర్చల అనంతరం తమ ఆర్మీలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి కలిగించాలని రష్యా ప్రెసిడెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. అటు ఈ యుద్ధంలో ఇప్పటికే ఇద్దరు భారతీయులు మరణించగా, భారీ జీతాలిస్తామని చెప్పి తమను ఆర్మీలో చేర్పించారని కొందరు ఆరోపిస్తున్నారు.

News July 9, 2024

‘టిల్లు క్యూబ్’లో తెలుగు హీరోయిన్?

image

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘టిల్లు’ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో తర్వాతి మూవీ ‘టిల్లూ క్యూబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ‘ట్యాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంకా జవాల్కర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో మూవీ టీమ్ పడిందట. ‘టిల్లూ స్క్వేర్’లో ఈ అమ్మడు చిన్న రోల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రియాంకకే మూవీ యూనిట్ ఓట్ వేస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

News July 9, 2024

పెరిగిపోతున్న ‘రోస్టింగ్’ కల్చర్

image

సోషల్ మీడియాలో ఈ మధ్య రోస్టింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఎవరైనా పాపులారిటీ సాధిస్తుంటే వారిలోని శారీరక లోపాలను ఎత్తి చూపుతూ, బూతులతో టార్గెట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా అసభ్యకర కామెంట్స్, మీమ్స్ కనిపిస్తున్నాయి. కాగా రోస్టింగ్‌ కోసం కొందరు ప్రత్యేకంగా పేజీలు క్రియేట్ చేస్తున్నారు. వీటికి కొందరు అమాయకులు సైతం బలైపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News July 9, 2024

తలొగ్గని రేవంత్ సర్కారు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: డీఎస్సీ పరీక్షల తేదీ మార్పు విషయంలో అభ్యర్థుల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గలేదు. పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు రోడ్డెక్కారు. అయితే షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంటే.. 25వేలకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రిపరేషన్ కోసం సమయం కావాలంటున్నారు.