India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణలో తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 15 వరకు జరగనుంది. మొత్తం 173 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 70,307 అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం గమనార్హం. పలు కాలేజీలు కొన్ని బ్రాంచీల్లో సీట్లను పెంచేందుకు AICTE అనుమతి పొందడంతో 2, 3 విడతల కౌన్సెలింగ్ వరకు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
AP: రాష్ట్ర ఇంధన శాఖ పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు విద్యుత్ రంగంపై నేడు వైట్ పేపర్‌ను విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు తీసుకునే చర్యల గురించి సీఎం చంద్రబాబు చెబుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 2019కి, నేటికి చోటుచేసుకున్న వ్యత్యాసాన్ని ప్రధానంగా వివరించనున్నారని పేర్కొన్నాయి.
TG: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
సేనాపతి గెటప్‌తో కమల్ హాసన్‌ను చూడగానే ఒళ్లు జలదరించిందని దర్శకుడు శంకర్ తెలిపారు. ‘భారతీయుడు తర్వాత చాలా సినిమాలు తీశాను. కానీ లంచం గురించి వార్తలు చూసినప్పుడల్లా ఆ సినిమాయే గుర్తొచ్చేది. భారతీయుడు-2 స్టార్ట్ అయ్యాక సేనాపతి గెటప్‌లో ఆయన్ను చూస్తే గూస్‌బంప్స్ వచ్చాయి. ఆడియన్స్ కూడా అదే అనుభూతిని పొందుతారు. ఆయనలాంటి నటుడు దొరకడం మా అదృష్టం’ అని పేర్కొన్నారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయన కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని పేర్కొంది. ‘డౌగ్‌కు ఇప్పటికే 3సార్లు వాక్సినేషన్, 3సార్లు బూస్టర్ డోసు పూర్తయ్యాయి. ఇంటిదగ్గర నుంచే ఐసొలేషన్‌లో ఉంటూ ఆయన పనిచేసుకుంటున్నారు. ఇక కమలా హారిస్‌కు నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్‌గా తేలింది’ అని వెల్లడించింది.
ప్రధాని మోదీ నేడు రష్యాకు రెండు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. 22వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయన్ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం నేడు మాస్కోకు చేరుకుని రేపటి వరకు అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి రేపు సాయంత్రం ఆస్ట్రియాకు వెళ్లనున్నారు. భారత పీఎం ఆస్ట్రియాలో పర్యటించడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఫామ్ హౌస్‌లో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో ఆయన ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని తమపై అభిమానంగా మార్చుకోవాలని కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యాలు చేరుకునేవరకు యుద్ధం జరిగేలా ‘గాజా’ కాల్పుల విరమణ ఒప్పందం ఉండాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా చేసిన సీజ్ ఫైర్ ప్రతిపాదనకు హమాస్ కొన్ని రోజుల క్రితం సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ ఒప్పందాన్ని అంగీకరించడంపై మల్లగుల్లాలు పడుతోంది. ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయాలని, హమాస్ 120మంది బందీలను విడుదల చేయాలనేది తాజా ఒప్పందంలో ప్రతిపాదన.
ప్రజలందరూ వారంలో 5 రోజుల పాటు శాకాహార భోజనం తీసుకోవాలని యాంకర్ రష్మి ట్విటర్‌లో్ కోరారు. ‘గతంలో వారంలో 5 రోజులు శాకాహారమే తినేవాళ్లం. ఆదివారమో లేక ప్రత్యేక సమయాల్లో మాత్రమే నాన్ వెజ్ వండుకునేవాళ్లం. అప్పుడు ఆరోగ్యాలు బాగుండేవి. కానీ నేడు చిన్నవయసులోనే మరణాలు ఎక్కువయ్యాయి’ అని పేర్కొన్నారు. నాన్ వెజ్ తినకపోతే శరీరానికి సరిపడా ప్రొటీన్ అందదన్న ఓ నెటిజన్ కామెంట్‌కు రిప్లైగా ఆమె ఈ పోస్ట్ పెట్టారు.
ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ రికార్డుల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసిందన్న వార్తలు వస్తుండగా తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ‘బుక్ మై షో’ వెబ్‌సైట్‌లో ఈ ఏడాది కోటి టిక్కెట్లు అమ్ముడైన తొలిసినిమాగా నిలిచింది. లాంగ్ రన్‌లో ‘కల్కి 2898ఏడీ’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్‌ను సులభంగా దాటేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.