India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మొటిక్ వస్తువులను(పేస్ట్, బ్రష్, షాంపూ వగైరా) నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అయ్యే మొత్తాన్ని గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమచేసే విధానం తెచ్చినా రెగ్యులర్‌గా చేయలేదట. దాదాపు రూ.10కోట్ల బకాయిలున్నట్లు తేల్చింది. దీంతో ఇకపై వస్తువుల్ని నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. 548 పాఠశాలల్లో 1.25లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
TG: గద్వాల BRS MLA బండ్ల <<13568887>>కృష్ణమోహన్‌రెడ్డిని<<>> కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. ఆయనను చేర్చుకుంటే పార్టీకి చెడ్డపేరు వస్తుందని రాష్ట్ర అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అయితే బండ్లను చేర్చుకోవడానికే పార్టీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు బండ్ల ఇప్పటికే ప్రకటించారు.
AP: కాకినాడకు చెందిన YCP నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంట కాలువల్లోకి ఆ సంస్థ శుద్ధి చేయని వ్యర్థాలను విడుదల చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీంతో పాటు పర్యావరణ ఉల్లంఘనలపైనా సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా సంస్థకు నోటీసులు ఇవ్వాలని పవన్ సూచించారు.
యూరో ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచులో రొనాల్డో టీమ్ పోర్చుగల్ ఓటమి పాలైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు ఒక్క గోల్ నమోదు చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించగా 5-3 తేడాతో ఫ్రాన్స్ సెమీస్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు ఆతిథ్య జర్మనీతో జరిగిన మ్యాచులో 2-1 తేడాతో స్పెయిన్ విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో అదనపు సమయం కేటాయించగా స్పెయిన్ గెలుపొందింది.
AP: దివంగత YSR 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పార్టీ మళ్లీ చైతన్యవంతమై ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు ఇది తొలి అడుగుగా ఉండాలని పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలోని రీచ్‌లలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టర్లుగా ఉన్న జేసీకేసీ, ప్రతిమా ఇన్‌ఫ్రా సంస్థలు ఆ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఇవాళ, రేపట్లో ఉచిత ఇసుక విధానంపై ఉత్తర్వులకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇసుక విక్రయాలపై పూర్తి అధికారం జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అప్పగించనున్నారు. సీనరేజ్ ఛార్జి టన్నుకు రూ.88, రవాణా ఖర్చు, జీఎస్టీ 18% కలిపి ధరలను కలెక్టర్లు ఖరారు చేస్తారు.
TG: ఇకపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TGSPDCL) పరిధిలో కరెంట్ బిల్లులను QR కోడ్‌తో చెల్లించవచ్చు. ఆ సంస్థ వచ్చే నెల నుంచి బిల్లులపై QR కోడ్ ముద్రించనుంది. చెల్లింపు కోసం వినియోగదారులు ఆ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే NPDCL దీన్ని పైలెట్ <<13568015>>ప్రాజెక్టుగా<<>> కొన్ని చోట్ల అమలు చేస్తోంది. సంస్థ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా బిల్లులు చెల్లించడం కంటే ఈ QR కోడ్ ద్వారా చెల్లింపు సులభతరం కానుంది.
జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత యువ జట్టు ఈరోజు తొలి మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా సాయంత్రం 4.30గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ 4, 5 ఛానళ్లలో ప్రసారం అవుతుంది. అటు రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్‌తో జట్టు కూర్పుపై BCCI దృష్టి పెట్టగా వారి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి యువ క్రికెటర్లకు ఇది ఓ ఎంట్రన్స్ టెస్టులా మారింది. మరి ఈ టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
AP: రాష్ట్రంలో 210 హైస్కూల్ ప్లస్‌లలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ల(SA)ను కేటాయించింది. గత ప్రభుత్వం మండలానికో కో-ఎడ్యుకేషన్, బాలికలకు ప్రత్యేక కాలేజీల ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. కానీ అధ్యాపకులను నియమించలేదు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి వీటిని ప్రారంభించారు. విద్యాశాఖ కోరిక మేరకు ఆయా బడుల్లో ఉన్న SAలను ప్రభుత్వం సర్దుబాటు చేసింది.
AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే VJA తూర్పు బైపాస్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి- HYD మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, మేదరమెట్ల- అమరావతి రహదారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించింది.
Sorry, no posts matched your criteria.