India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్‌లో రికార్డ్ స్థాయిలో కొత్తగా 42.4లక్షల డీమ్యాట్ అకౌంట్లు నమోదయ్యాయి. ఓ నెలలో నలభై లక్షలకుపైగా అకౌంట్లు క్రియేట్ అవడం ఇది నాలుగోసారి. గతంలో 2023 డిసెంబరు సహా ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆ స్థాయిలో అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. ఇక మొత్తంగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 16.2కోట్లకు చేరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మార్కెట్లు రాణిస్తుండటంతో మదుపర్లలో ఆసక్తి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు టెర్రర్ ఫండింగ్ కేసులో జైలుకెళ్లిన కశ్మీరీ నేత ఇంజనీర్ రషీద్ కూడా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఖడూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి అమృత్‌పాల్, బారాముల్లా స్థానం నుంచి రషీద్ ఎంపీలుగా గెలుపొందారు. కానీ వీరు జైల్లో ఉండటంతో మిగతా ఎంపీలతో ప్రమాణం చేయలేకపోయారు. ఇప్పుడు పెరోల్‌పై పార్లమెంట్‌కు వచ్చి ప్రమాణం చేశారు.
AP: ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. స్మగ్లింగ్‌ను నియంత్రించేలా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసి శేషాచలం అడవిలో దుంగలు ఎక్కడ దాచి పెట్టారో గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులు జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్లకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న వారితో పాటు వాళ్ల వెనుక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.
TG: ఉపాధ్యాయుడిపై ప్రేమ, గౌరవంతో 133 మంది విద్యార్థులు స్కూల్ మారారు. మంచిర్యాల జిల్లా జన్నారం(M) పోనకల్ ప్రభుత్వ స్కూల్ టీచర్ జె.శ్రీనివాస్ ఇటీవల అదే మండలంలోని అక్కపెల్లిగూడలోని స్కూలుకు బదిలీ అయ్యారు. తాము అభిమానించే, తమకు స్పెషల్ క్లాసులు చెప్పే గురువు కోసం విద్యార్థులు 3 కి.మీ దూరంలో ఉన్న ఆ పాఠశాలకు మారారు. దీనికి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు.
ప్రపంచ కప్ విజేతలు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, శివమ్ దూబేకు మహారాష్ట్ర సర్కార్ రూ.11 కోట్ల నజరానా ప్రకటించింది. అంతకుముందు మహారాష్ట్ర అసెంబ్లీలో వీరందరినీ సీఎం ఏక్‌నాథ్ షిండే శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం కెప్టెన్ రోహిత్ సభలో ప్రసంగించారు.
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ తరఫున రామచంద్రయ్య, జనసేన తరఫున హరిప్రసాద్ నామినేషన్ వేశారు. ఇతర పార్టీల నుంచి ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా వీరిద్దరి ఎన్నిక లాంఛనమైంది.
TG CM రేవంత్ రెడ్డితో భేటీపై AP CM చంద్రబాబు స్పందించారు. 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడటమే తన విధానమన్నారు. రెండింటికీ సమన్యాయం చేయాలని విభజన వేళ కూడా చెప్పానని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. CBNకు స్వాగతం పలికేందుకు TDP శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి.
బిహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా జలవనరుల శాఖకు చెందిన 11మంది ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. కూలిపోయిన బ్రిడ్జిల స్థానంలో కొత్తవి నిర్మించాలని ఆదేశించింది. గతంలో వంతెనలు నిర్మించిన కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేస్తూ కొత్తవాటి నిర్మాణానికి వారే నిధులు సమకూర్చాలని పేర్కొంది. కాగా బిహార్‌లో 14 రోజుల్లో 12 వంతెనలు కూలిపోయాయి.
యువత వారానికి 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇచ్చిన సలహాను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన అల్లుడు రిషి సునాక్ ఓడిపోవడంతో సెటైర్లు వేస్తున్నారు. తన మామగారి సలహాను పాటించకపోవడంతోనే రిషి ఓడిపోయారేమోనంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మూర్తి చెప్పిన సూత్రాన్ని UKలో అమలు చేస్తారేమోనని ఓడించారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో రూ.1.27 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులు జరిగినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. 2022-23తో పోలిస్తే ఏకంగా 16.8% పెరిగినట్లు పేర్కొన్నారు. ఆత్మనిర్భరత లక్ష్యాన్ని చేరుకోవడంలో PM ఆధ్వర్యంలో ప్రభుత్వ విధానాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ ఘనత సాధించినందుకు రక్షణ శాఖకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.