India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జియో IPO వస్తే భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ప్రస్తుతం LIC ఐపీఓ (₹21వేల కోట్లు) టాప్‌లో ఉంది. మరోవైపు ₹25వేల కోట్లతో హ్యుందాయ్ ఐపీఓ లాంచ్‌కు సిద్ధంగా ఉంది. కానీ జియో ఐపీఓ ఇందుకు రెండింతలు (₹55,500కోట్లు) ఉంటుందని జెఫరీస్ సంస్థ చెబుతోంది. ₹లక్ష కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉండే సంస్థలు కనిష్ఠంగా 5% షేర్లు ఐపీఓలో పెట్టొచ్చు. కాగా జియో Mcap ₹11.11లక్షల కోట్లుగా ఉంది.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత్ కార్యక్రమం ఈరోజు రాత్రి ముంబైలో జరగనుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్ ఆడిపాడనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం గడచిన వారం రోజులుగా వారు రిహార్సల్స్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ సైతం ఈ కార్యక్రమంలో పాడేందుకు భారత్‌కు చేరుకున్నారు.
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం నియోజకవర్గానికి వెళ్లనున్న ఆయన.. 2 రోజులు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
TG: రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని BRS నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
T20 వరల్డ్ కప్‌తో ఇండియాకు తిరిగొచ్చిన జట్టుకు ముంబైలో అభిమానులు కనీవినీ ఎరుగని రీతిలో అపూర్వస్వాగతం పలికారు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తాను ఓపెన్ టాప్ బస్సులో వరల్డ్ కప్‌ను ఎత్తుకుని అభిమానులకు అభివాదం చేస్తున్న ఫొటోను Xలో షేర్ చేశారు. ‘ఈ కప్ మీకోసమే’ అని పేర్కొంటూ త్రివర్ణ పతాకాన్ని పోస్టు చేశారు. ఈ ట్వీట్ వైరలవుతోంది.
వక్త, రచయిత ఉదయ్ నాగరాజు UK ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. TGలోని సిద్దిపేట(D) శనిగరానికి చెందిన నాగరాజు భారత మాజీ PM పీవీ నరసింహారావుకు బంధువు. నిజామాబాద్(D) కోటగిరికి చెందిన కన్నెగంటి చంద్ర కన్జర్వేటివ్ అభ్యర్థిగా స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్‌లో ఓడిపోయారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందించిన ఆయన రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు.
ప్రధాని మోదీ, AP CM చంద్రబాబు భేటీపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ మండిపడింది. ‘‘ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, సైకోలకి కోట్లు కుమ్మరిస్తూ ‘తాడేపల్లి ప్యాలెస్ సైకో’ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. PM, CM భేటీపై కూడా ఫేక్ న్యూస్ ఆర్టికల్స్ సృష్టించారు. నిన్న కూడా అసలు రాష్ట్రంతో చర్చలే జరపని capgemeni వెళ్లిపోయిందంటూ విష ప్రచారం. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని ట్వీట్ చేసింది.
ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు సాగిన ‘విక్టరీ పరేడ్’ గురించి స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ‘నిన్నటి సాయంత్రాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మా చుట్టూ ఉన్నవారిలో సంతోషం, భావోద్వేగాలు, వేడుకలు చూస్తే అంతా కలగా అనిపించింది. మీరు చూపిన ప్రేమకు చాలా థ్యాంక్స్. ఇది చూస్తే అర్థమవుతోంది మీకు ఈ కప్ అంటే ఎంత ఇష్టమో. ఈ కప్ మీ అందరికీ చెందినది’ అని ట్వీట్ చేశారు.
AP: అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మీడియా హాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. MLA, MLCల క్వార్టర్ల నిర్మాణాలు ఎప్పటిలోగా పూర్తి చేయగలరని సమీక్షలో CRDA అధికారులను ప్రశ్నించారు. అసెంబ్లీ భవనంలో లీకేజీలను అరికట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో లైబ్రరీ, కమిటీ ఛైర్మన్ల ఛాంబర్ల ఏర్పాటుపై అయ్యన్న సమాలోచనలు చేశారు.
కశ్మీర్‌పై లేబర్ పార్టీ నేత జెరెమీ తీర్మానంతో డ్యామేజీ కలిగిందని తెలుసుకున్న PM అభ్యర్థి స్టార్మర్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత సమస్య అని చెప్పారు. INDతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దీపావళి, హోళీ వంటి హిందూ వేడుకల్లోనూ పాల్గొన్నారు. దీన్నిబట్టి ఆయన INDతో మంచి బంధాన్ని కొనసాగిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.