news

News July 5, 2024

HYDలో ఇళ్ల అమ్మకాల జోరు

image

ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య హైదరాబాద్‌లో 18,573 ఇళ్లు/ఫ్లాట్ల కొనుగోలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో విక్రయాలతో పోలిస్తే 21 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ 71 శాతం పెరిగి 50 లక్షల చదరపు అడుగులకు చేరినట్లు పేర్కొంది. ముంబైలో అత్యధికంగా 47,259 గృహాలు విక్రయం కాగా ఆ తర్వాత ఢిల్లీ-NCR(28,998), బెంగళూరు(27,404), పుణే(24,525) ఉన్నాయంది.

News July 5, 2024

‘మెదడును తినే అమీబా’.. బాలుడి మృతి

image

అమీబిక్ మెనింజో ఎన్‌సెఫలైటిస్(మెదడును తినే అమీబా) వ్యాధి బారిన పడి కేరళలో మృదుల్(14) అనే బాలుడు మృతి చెందాడు. కలుషిత జలాల్లో ఉండే అమీబా బాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినపుడు ఈ వ్యాధి సోకుతుంది. బాలుడు కోజికోడ్‌లోని ఓ కొలనులో ఇటీవల దిగాడని అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ భయంకర వ్యాధి బారిన పడి ఇద్దరు బాలికలు మరణించారు. 2017, 23లో అలప్పుళ(D)లో ఈ కేసులు నమోదయ్యాయి.

News July 5, 2024

దేశంలో 8 నెలల గరిష్ఠానికి నిరుద్యోగం

image

భారత్‌లో నిరుద్యోగం 8 నెలల గరిష్ఠానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది జూన్ చివరి నాటికి 8.5శాతంగా, ఈ ఏడాది మేలో 7శాతంగా ఉన్న నిరుద్యోగిత ప్రస్తుతం 9.2శాతానికి చేరిందని వెల్లడించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. ఇక మహిళా నిరుద్యోగ శాతం జాతీయ నిరుద్యోగ రేటుకు దాదాపు రెట్టింపు పెరిగిందని స్పష్టం చేసింది.

News July 5, 2024

APలో రూ.60వేల కోట్లతో BPCL రిఫైనరీ

image

AP: మచిలీపట్నంలో రూ.60వేల కోట్లతో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిన్న పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురితో సీఎం చంద్రబాబు ఈ విషయంపై చర్చించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్రమంత్రి సూచించగా.. మచిలీపట్నంలో అందుబాటులో ఉందని సీఎం, ఎంపీ బాలశౌరి వివరించారు.

News July 5, 2024

నాకు ప్రాణహాని ఉంది.. భద్రత ఇవ్వండి: హైకోర్టులో అంబటి పిటిషన్

image

AP: ఇప్పటివరకు తనకున్న 4+4 గన్‌మెన్ల భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. DGP, పల్నాడు SPకి వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలేదని తెలిపారు. దీనికి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

News July 5, 2024

టీటీడీపీ ర్యాలీకి పోలీసుల అనుమతి

image

TG: AP CMగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా HYD వస్తున్న తమ అధినేత చంద్రబాబుకు టీటీడీపీ ఘన స్వాగతం పలకనున్న సంగతి తెలిసిందే. బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు 50 కార్లు, 150 బైకులతో ఈరోజు సాయంత్రం ర్యాలీ నిర్వహించాలని టీటీడీపీ భావించింది. ఆ మేరకు పోలీసుల్ని అనుమతి కోరగా.. 300మందికి మించి ర్యాలీలో పాల్గొనరాదని, డీజేలు, పేపర్ స్ప్రే గన్స్ వాడొద్దని సూచించి పోలీసులు అనుమతినిచ్చారు.

News July 5, 2024

ఏపీలోని హైవేలకు రూ.4,774 కోట్లు

image

AP: 2024-25 వార్షిక ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని 14 నేషనల్ హైవేలకు రూ.4,744 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
☛ కడప-రాయచోటి ఘాట్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 4 లేన్ల టన్నెల్ రోడ్డుకు రూ.1,000 కోట్లు
☛ ఆకివీడు-దిగమర్రు మధ్య 40KM మేర నాలుగు లేన్ల రోడ్డుకు రూ.1,200 కోట్లు
☛ అమలాపురం-రావులపాలెం మధ్య రోడ్డుకు రూ.630 కోట్లు
☛ నూజివీడు-లక్ష్మీపురం మధ్య 47KM రోడ్డుకు రూ.625 కోట్లు

News July 5, 2024

యూకేలో రిషి సునాక్‌కు షాక్!

image

UK జనరల్ ఎలక్షన్స్‌లో తొలి ఫలితం వెలువడింది. సదర్‌ల్యాండ్‌‌లో లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి 18,847 ఓట్లు రాగా, రిఫార్మ్ UK పార్టీకి 11,668 ఓట్లు, రిషి సునాక్ కన్జర్వేటివ్‌ పార్టీకి 5,514ఓట్లు వచ్చాయి. లేబర్ పార్టీకి 410, కన్జర్వేటివ్‌ పార్టీకి 131 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఒకవేళ ఇదే నిజమైతే లేబర్ పార్టీ లీడర్ కెయిర్ స్టార్మర్ తర్వాతి ప్రధాని అయ్యే ఛాన్సుంది.

News July 5, 2024

నేటి నుంచి హైదరాబాద్‌లో ‘కూలీ’ షూటింగ్

image

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘కూలీ’. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి హైదరాబాద్‌లో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 35 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌కోసం సూపర్ స్టార్ ఇప్పటికే నగరానికి చేరుకున్నారని చిత్ర బృందం తెలిపింది. బంగారం స్మగ్లింగ్ ప్రధాన ఇతివృత్తంగా కథ ఉండనుందని సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ‘కూలీ’ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

News July 5, 2024

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల

image

AP: వివిధ విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టు షెడ్యూల్‌ను APPSC విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. అలాగే మెడికల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ను సంప్రదించాలని సూచించారు.