news

News July 5, 2024

TODAY HEADLINES

image

* ముంబైలో టీమ్‌ఇండియా ర్యాలీ.. ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మెరైన్ రోడ్డు
* కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం: సీఎం రేవంత్
* ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు: కేసీఆర్
* ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులతో AP సీఎం CBN భేటీ
* చంద్రబాబూ.. ఎల్లకాలం మీ రోజులే ఉండవు: జగన్
* ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
* హాథ్రస్ తొక్కిసలాటలో ఆరుగురు అరెస్ట్, పరారీలో భోలేబాబా

News July 4, 2024

వికసిత AP నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: అమిత్ షా

image

వికసిత భారత్‌, వికసిత AP నిర్మాణానికి NDA ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. CM చంద్రబాబు, TDP MPలతో సమావేశమై దేశం, రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపారు. దీనికి CBN బదులిస్తూ ‘వికసిత భారత్, వికసిత AP లక్ష్యంగా పని చేసేందుకు మేము సర్వ సన్నద్ధంగా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు మీ సహకారం అవసరం’ అని పేర్కొన్నారు.

News July 4, 2024

రేపు HYDలో మహ్మద్ సిరాజ్ రోడ్ షో

image

T20 ప్రపంచ కప్ విజేత మహ్మద్ సిరాజ్ రేపు హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అభిమానులు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మెహిదీపట్నంలోని సరోజిని ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షోకు అభిమానులు తరలిరావాలని సిరాజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కోరారు.

News July 4, 2024

రిటైర్మెంట్‌పై బుమ్రా కీలక వ్యాఖ్యలు

image

తన కెరీర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించనని టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన సంగతి తెలిసిందే. 8 మ్యాచులాడి తక్కువ ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో బుమ్రా తొలివరుసలో ఉన్నారు.

News July 4, 2024

ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేకే?

image

TG: కె.కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు ఉన్న రాజకీయ, పరిపాలనాపరమైన అనుభవాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిన్న బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కేకే, ఇవాళ రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ తనకు సొంతిల్లు వంటిదని చెప్పారు.

News July 4, 2024

దర్శన్ నా కొడుకు లాంటివాడు: సుమలత

image

రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్ట్ కావడం షాక్‌కు గురి చేసిందని నటి సుమలత తెలిపారు. ‘అతడు 25ఏళ్ల నుంచి తెలుసు. నాకు కొడుకు లాంటివాడు. ఏ తల్లీ తన కొడుకుని ఇలాంటి స్థితిలో చూడాలనుకోదు. దర్శన్ ఈ నేరానికి పాల్పడ్డాడని అనుకోవడం లేదు’ అని ఓ ప్రకటన విడుదల చేశారు. అదేసమయంలో రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సుమలత.. ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

News July 4, 2024

TGలో పదేళ్లకోసారి అధికారం మారుతుంది: రేవంత్

image

తెలంగాణలో పదేళ్లకోసారి, ఏపీలో ఐదేళ్లకోసారి అధికారం మారే ట్రెండ్ ఉందని TG సీఎం రేవంత్ అన్నారు. 2029 వరకు TGలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు. పోలింగ్ రోజు రిజర్వులో ఉండే 15% యంత్రాలను ట్యాంపరింగ్ చేసి అటు ఇటు మారిస్తే ఎవరికీ తెలిసే అవకాశం లేదు’ అని ఢిల్లీలో మీడియాతో వ్యాఖ్యానించారు.

News July 4, 2024

ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇన్ఫార్మ్ చేయండి!

image

ట్రాఫిక్ నియమాలు పాటించకుండా రోడ్డుపై ఇబ్బందికలిగించేలా డ్రైవ్ చేసేవారిని కట్టడిచేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వారిని గుర్తించడంలో తమకు సహకరించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడేవారి ఫొటోలను 9490617346 నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించింది. ప్రాంతం, తేదీ, సమయాన్ని మెన్షన్ చేయాలని పేర్కొంది.

News July 4, 2024

ఫైళ్లను YCP ఆఫీస్‌లో తగలబెట్టామా?: పేర్ని

image

AP: పీసీబీ, ఏపీఎండీసీ ఫైళ్లు తగలబెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న విషయం మర్చిపోయారా అని టీడీపీ నేతలను ఎద్దేవా చేశారు. అవసరమైతే సీబీఐ, సీఐడీతో విచారణ చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఫైళ్లను ఏమైనా వైసీపీ కార్యాలయంలో తగలబెట్టామా అని ఆయన నిలదీశారు.

News July 4, 2024

ఈ రెండు పరేడ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే..!

image

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. లక్షలాదిగా తరలిరావడంతో ముంబై వీధులు సముద్రాన్ని తలపించాయి. ఇంతటి ప్రజాదరణ 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు బ్యూనస్ ఎయిర్స్‌లో లభించింది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ రెండు పరేడ్స్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అభిమానులు అంటున్నారు.