News July 4, 2024
ఈ రెండు పరేడ్స్ ఎప్పటికీ చిరస్మరణీయమే..!

ముంబైలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీకి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. లక్షలాదిగా తరలిరావడంతో ముంబై వీధులు సముద్రాన్ని తలపించాయి. ఇంతటి ప్రజాదరణ 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు బ్యూనస్ ఎయిర్స్‌లో లభించింది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీని చూసేందుకు అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ రెండు పరేడ్స్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అభిమానులు అంటున్నారు.
Similar News
News December 15, 2025
కాకినాడ: నేడు మధ్యాహ్నం 1 వరకే ఈ కార్యక్రమం

నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కలెక్టరేట్‌లో జరుగుతుందని కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తన సమస్యలు విన్నవించేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అందుబాటులో లేని వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

జిల్లావ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, మండలం, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. వాటి స్థితిని 1100 నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.