India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ, కెయిర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ కలుపుకొని 650 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. 4.6 కోట్లమంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి పదింటికి ఓటింగ్ ముగియగానే కౌంటింగ్ చేపట్టి ఫలితాల్ని ప్రకటిస్తారు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లకు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆహ్వానం అందింది. ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్‌శర్మ, సూర్య కుమార్ యాదవ్, శివం దూబే, యశస్వీ జైస్వాల్ అసెంబ్లీకి వెళ్లి సీఎం ఏక్‌నాథ్ షిండేను కలిసే అవకాశం ఉంది. ఇతర క్రికెటర్లను సైతం ఆయా రాష్ట్రాల సీఎంలు సత్కరిస్తారు.
జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్స్ టారిఫ్‌లు పెంచి యూజర్లకు షాక్ ఇచ్చాయి. అయితే ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని అధికార వర్గాల సమాచారం. టెలికాం రంగంలో సంస్థల మధ్య తగిన పోటీ ఉందని, కేంద్రం జోక్యం చేసుకునేంత పరిస్థితులు లేవని పేర్కొన్నాయి. బయటదేశాలతో పోలిస్తే భారత్‌లో టారిఫ్ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నట్లు తెలిపాయి. అయితే టెలికాం సంస్థలు సేవల్లో నాణ్యత పెంచుకోవాల్సి అవసరం ఉందని సూచించాయి.
భారత్, పాక్ ఆడే మ్యాచ్‌లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా CEO నిక్ హాక్లీ చెప్పారు. దాయాది దేశాలు, ఆసీస్‌తో కలిపి ముక్కోణపు సిరీస్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. తుది నిర్ణయం భారత్, పాక్ బోర్డులపైనే ఆధారపడి ఉంటుందని, ఇప్పటి వరకు తాము చర్చలు జరపలేదని పేర్కొన్నారు. 2012 నుంచి IND-PAK ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని విషయం తెలిసిందే. ICC ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.
AP: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని YS జగన్ మండిపడ్డారు. నెల్లూరు జైలులో ఆయనను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు ఓటేయలేదనే కారణంతో రాష్ట్రంలో ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. పైగా బాధితులపైనే దొంగ కేసులు పెడుతున్నారు. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. CBN ధోరణి మార్చుకోవాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.
తొక్కిసలాట జరిగిన యూపీలోని హాథ్రస్‌కు రాహుల్ గాంధీ త్వరలోనే వెళ్తారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని వెల్లడించారు. రెండు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే సంఘటనా స్థలాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు.
ద.కొరియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆఫీసులో సేవలందించే రోబోట్ దానంతట అదే మెట్లపై నుంచి దూకింది. అంతకుముందు అయోమయంగా తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రోబో సూసైడ్ చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఇలాంటి కేసు ఇదే తొలిసారంటున్నారు. కచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు రోబో ముక్కలను కంపెనీకి పంపినట్లు తెలిపారు. అయితే రోబోలు ఆత్మహత్యకు పాల్పడటం అసాధ్యమనే వాదనలూ వినిపిస్తున్నాయి.
ఫ్రాన్స్‌లోని రోకమడౌర్‌లో రాతిలో ఉన్న ఆ ఖడ్గం 1300 ఏళ్ల నాటిది. డురండాల్ కత్తిగా పిలుచుకునే దాన్ని 8వ శతాబ్దంలో రోలాండ్ అనే సేనాధిపతి వాడారట. చనిపోయే ముందు ఆయన కత్తిని విసిరితే వందల మైళ్లు దూరంలోని రోకమడౌర్‌లో రాయిలో దిగబడిందనేది స్థానికుల నమ్మిక. పర్యాటక ఆకర్షణగా ఉన్న ఆ కత్తి చోరీకి గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దొంగల్ని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండటం, స్క్రిప్ట్ బుక్‌కు పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్, VFX పనులు కొనసాగుతున్నాయి. కాగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.
AP: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. ‘బ్రిటిష్ పాలకులపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి పేరు వింటేనే ఒక మహోజ్వల శక్తి, స్ఫూర్తి అందరికీ అందుతాయి. సమాజం కోసం ఆలోచించి బాధిత వర్గాలకు బాసటగా నిలవాలని ఆ యోధుడి జీవితం తెలియజేస్తుంది. గిరిజనుల కోసం పోరాడిన మన్యం వీరుడి స్ఫూర్తిని నవతరం కొనసాగించాలి’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.