India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి రక్తపు చుక్క, తెలంగాణలో హక్కుల సాధనకు వేగుచుక్క దొడ్డి కొమురయ్య అని సీఎం రేవంత్ కీర్తించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు.
నదులు ఉగ్రరూపం దాల్చడంతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరస వరదలతో వణికిపోతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్‌లో నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. అస్సాంలో వరదలకు 8మంది బలయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 16 లక్షలమంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చైనా, భూటాన్, అరుణాచల్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలే దీనికి కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
కాలుష్యం వల్ల భారత్‌లోని 10 నగరాల్లో ఏటా సగటున 33వేల మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 2008-2019 మధ్య ఉన్న సమాచారం ఆధారంగా అధ్యయనాన్ని నిర్వహించినట్లు పేర్కొంది. పౌరులను కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను భారత్ కచ్చితంగా అనుసరించాలని హెచ్చరించింది. అత్యధికంగా ఢిల్లీలో ఏడాదికి 12వేలమంది మరణిస్తున్నారని స్పష్టం చేసింది.
AP: <<13558406>>ఉచిత<<>> ఇసుక విధానంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు. గతంలో టన్ను ₹475 చొప్పున విక్రయించారు. కాంట్రాక్టర్, రవాణా ఖర్చు ₹100 తీసేయగా మిగిలిన ₹375 ప్రభుత్వానికి చేరేది. ఇకపై ఆ మొత్తం కాకుండా రూ.88 వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఆ డబ్బునూ స్థానిక సంస్థలకే కేటాయిస్తారు. ₹88తోపాటు స్టాక్ పాయింట్‌లో లోడింగ్ ఖర్చు, రవాణా వ్యయాన్ని(దాదాపు ₹100) కలెక్టర్లు ఖరారు చేస్తారు.
TG: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై రైతులు దిగులు చెందనవసరం లేదని వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. దీర్ఘ, మధ్యకాలిక వంగడాలకు బదులు స్వల్పకాలిక వరి వంగడాలను సాగు చేయాలని సూచించింది. వరిని నేరుగా విత్తే విధానాన్ని పాటించాలని, అలా అయితే పంట సకాలంలో చేతికి అందుతుందని వెల్లడించింది. దిగుబడులూ బాగుంటాయని పేర్కొంది. ఈ మేరకు రైతులు అనుసరించాల్సిన విధానాలపై వర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా వివరించారు.
AP: భారత స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వాతంత్ర్య సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉందని అభిప్రాయపడ్డారు. సమసమాజ స్థాపనకు అల్లూరి చూపిన బాట మనకు ఆదర్శప్రాయమని ఆయన ట్వీట్ చేశారు.
UPలోని హాథ్రస్‌లో 121 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలచివేసింది. ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచగా వారి బంధువులు చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. చనిపోయిన తమ వాళ్లను తలుచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపించాయి. కాగా తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఇప్పుడు చిందరవందరగా మారింది. గాయపడిన వారితో ఆసుపత్రుల వార్డులు నిండిపోయాయి. అవన్నీ పై 8 ఫొటోల్లో చూడవచ్చు.
TG: ఎప్‌సెట్ కౌన్సెలింగ్ తొలి విడత నేటి నుంచి ప్రారంభం కానుంది. 12వ తేదీ వరకు జరిగే ఈ ప్రక్రియలో విద్యార్థులు ప్రాసెసింగ్ రుసుం చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. ఈ నెల 19లోపు తొలి విడత సీట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
TGSRTCలో <<13550618>>3,035<<>> ఉద్యోగాలను 3 బోర్డుల ద్వారా భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లింది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుతో డ్రైవర్, శ్రామిక్, డిప్యూటీ సూపరింటెండెంట్- ట్రాఫిక్, మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తారు. TGPSCతో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, DM, సెక్షన్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలను, హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డుతో మెడికల్ ఆఫీసర్లను నియమించనున్నారు.
AP: వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే సదరం స్లాట్ బుకింగ్ శిబిరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు స్లాట్‌లను విడుదల చేశారు. ఇందుకోసం మీసేవ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో ముందస్తు స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. స్లాట్‌లు బుక్ చేసుకున్న వారికి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు స్క్రీనింగ్ నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.
Sorry, no posts matched your criteria.