India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఢిల్లీలో కూటమి ఎంపీలతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. టీడీపీ, బీజేపీ, జనసేన ఎంపీలతో డిన్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ అర్వింద్ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన తండ్రి డి.శ్రీనివాస్ మరణించడంతో అర్వింద్‌ను సీఎం పరామర్శించారు. కాగా రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు.
తేది: జులై 04, గురువారం
త్రయోదశి: ఉదయం 05:34 గంటలకు
చతుర్దశి: తెల్లవారుజామున 04:40 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 09:53- 10:45 గంటల వరకు,
మధ్యాహ్నం 03:06- 03:58 గంటల వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 01:30 -03:00 గంటల వరకు
*అమరావతిపై శ్వేతపత్రం విడుదల
*అమరావతిని నాశనం చేశారు.. పునర్నిర్మిస్తాం: CBN
*కుదిరినప్పుడు సినిమాలు చేస్తా: పవన్ కళ్యాణ్
*AP: ఉచితంగా ఇసుక పంపిణీ: మంత్రి కొల్లు రవీంద్ర
*AP: గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
*TG: రాష్ట్రంలో పవర్ కట్స్ లేవు: డిప్యూటీ సీఎం భట్టి
*TG: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి
*మణిపుర్‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం కృషి: మోదీ
*హాథ్రస్ ఘటనలో 121కి చేరిన మరణాలు
*ఉ.6 గంటలకు ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది.
*ఉ.9.30 గంటలకు ప్రధాని మోదీతో అల్పాహార విందు
*మరో విమానంలో ముంబైకి బయల్దేరనున్న ప్లేయర్లు
*సా.4 గంటలకు ముంబైలో ల్యాండింగ్
*సా.5 గంటలకు నారిమన్ పాయింట్‌లో ఓపెన్ బస్ ఎక్కనున్న క్రికెటర్లు
*సా.5 నుంచి రా.7 వరకు ఓపెన్ బస్ పరేడ్
*రా.7 నుంచి రా.7.30 వరకు వాంఖడే స్టేడియంలో ఫంక్షన్
AP: విజయవాడలో ఏపీఎండీసీ ఫైళ్ల దహనం ఘటన కలకలం రేపింది. పెదపులిపాక కరకట్ట వద్ద కొందరు కారులో వచ్చి ఫైళ్లను తగలబెట్టారు. దస్త్రాలు తగలబడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి అక్కడకు వెళ్లడంతో వారు కారులో పరారయ్యారు. దగ్ధమైన ఫైళ్లు గనులశాఖకు చెందినవిగా గుర్తించారు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
AP: రాష్ట్రంలో సినిమాలు తీసేందుకు సినీ పరిశ్రమ తహతహలాడుతోందని నటుడు నరేశ్ అన్నారు. విజయవాడ రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కొత్త ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మంచి లోకేషన్లు, ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రంలో పరిశ్రమ త్వరగా అభివృద్ధి చెందుతుంది. వచ్చే ఐదేళ్లలో రాజధాని, పోలవరం పూర్తవుతాయనుకుంటున్నా’ అని తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే.అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స అందించారు.
బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ వసూళ్ల పరంపర కొనసాగుతోంది. 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, రజనీకాంత్ ‘జైలర్’, సల్మాన్ ‘సుల్తాన్’ లైఫ్‌టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఇంకా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని రికార్డుల్ని సృష్టించవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఆమిర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ రికార్డుల్నీ కల్కి దాటేయడం విశేషం.
అమెరికా అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌తో జరిగిన తాజా డిబేట్‌లోనూ బైడెన్ తేలిపోయారు. దీంతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందని, తప్పుకోవడమే మేలని బైడెన్ భావిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ కథనాన్ని శ్వేతసౌధం ఖండించింది.
తన ఫ్యాన్‌ను చిత్రహింసలు పెట్టి చంపారనే ఆరోపణలపై జైలుకెళ్లారు కన్నడ హీరో దర్శన్. అయినప్పటికీ కర్ణాటకలో అతడి ఫ్యాన్స్ అభిమానం వెర్రితలలు వేస్తూనే ఉంది. తాజాగా ఓ జంట తమ బిడ్డకు ఖైదీ నంబర్ 6106 (జైల్లో దర్శన్‌కు కేటాయించిన నంబర్) అని రాసి ఉన్న వైట్ డ్రస్ వేసి ఫొటో షూట్ చేశారు. ఇది వైరల్ కావడంతో బాలల హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. కాగా.. చాలామంది ఫ్యాన్స్ 6106ను టాటూగా వేయించుకుంటుండటం గమనార్హం.
Sorry, no posts matched your criteria.