News July 3, 2024

ఏపీలో షూటింగ్స్‌కోసం తహతహలాడుతున్నాం: నరేశ్

image

AP: రాష్ట్రంలో సినిమాలు తీసేందుకు సినీ పరిశ్రమ తహతహలాడుతోందని నటుడు నరేశ్ అన్నారు. విజయవాడ రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘కొత్త ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. మంచి లోకేషన్లు, ప్రభుత్వ సహకారం ఉంటే రాష్ట్రంలో పరిశ్రమ త్వరగా అభివృద్ధి చెందుతుంది. వచ్చే ఐదేళ్లలో రాజధాని, పోలవరం పూర్తవుతాయనుకుంటున్నా’ అని తెలిపారు.

Similar News

News December 12, 2024

త్వరలో RTC బస్సుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు

image

TG: రాష్ట్రంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య త్వరలోనే ‘చిల్లర’ సమస్యలు తీరనున్నాయి. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ల కోసం RTC ఏర్పాట్లు సిద్ధం చేయగా, తొలుత HYDలో పరిశీలించనుంది. ఆపై రాష్ట్రమంతటా వినియోగంలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే సంస్థ చేతికి 6 వేల ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లు అందాయి. ప్రస్తుతం దూరప్రాంత రూట్లలోనే ఉండగా, త్వరలో ఇవి పల్లెవెలుగు వంటి గ్రామీణ ప్రాంత బస్సుల్లోనూ ఉపయోగించనున్నారు.

News December 12, 2024

రాహుల్.. ఫోన్ బ్యాంకింగ్ బాగోతం గుర్తులేదా: నిర్మలా సీతారామన్

image

ప్రభుత్వ బ్యాంకులను కాంగ్రెస్ ATMsగా ట్రీట్ చేసిందని FM నిర్మల అన్నారు. ‘ఫోన్ బ్యాంకింగ్’తో ఉద్యోగులను ఒత్తిడిచేసి తమ క్రోనీస్‌కు లోన్లు మంజూరు చేయించిందన్నారు. ‘2015లో మేం చేపట్టిన సమీక్షలో ఫోన్ బ్యాంకింగ్ బాగోతం బయటపడింది. NPAలతో గడ్డకట్టుకుపోయిన బ్యాంకింగ్ వ్యవస్థను నిధులిచ్చి మోదీ ప్రభుత్వమే కాపాడింద’న్నారు. సంపన్నులకు PSBలు ప్రైవేటు ఫైనాన్షియర్లుగా మారాయన్న రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు.

News December 12, 2024

నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సెలవు

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తిరుపతిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.