news

News July 3, 2024

మూడు నెలల్లో 5వేల పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

image

బీఎస్ఈ సెన్సెక్స్ 80వేల మార్క్ తాకడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. 57 రోజుల్లోనే 5వేల పాయింట్లు వృద్ధి చెంది 75వేల నుంచి 80వేల మార్క్ చేరుకోవడం విశేషం. జూన్ 9న ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెన్సెక్స్ 3వేల పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ చరిత్రలో అత్యంత వేగంగా 5వేల పాయింట్లు పెరిగిన జాబితాలో ఈ వృద్ధి మూడోస్థానంలో ఉంది. 2021లో 28రోజుల్లోనే 5 పాయింట్లు పెరిగాయి.

News July 3, 2024

రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్: కాంగ్రెస్

image

TG: ఎంపీ ఎన్నికలతో ప్రజా పాలనకు బ్రేకులు పడ్డాయని మరో రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. KTR నిరుద్యోగుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని సెటైర్లు వేసింది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేని BRS ప్రభుత్వం, యువత దశాబ్ద కాలాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టింది. అంతకుముందు కేటీఆర్ AEE(సివిల్ జాబితాను) వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News July 3, 2024

ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో: CM చంద్రబాబు

image

AP: తన విజన్‌ను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమోనని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. 2019లో అమరావతి ప్రాంతంలోనూ పెద్దగా ఓట్లు రాకపోవడంపై స్పందించారు. ‘నేనెప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. గతాన్ని తవ్వడం వల్ల ఉపయోగం లేదు. అమరావతి, AP అభివృద్ధి కోసం పని చేసినా ప్రజలకు చెప్పలేకపోయానేమో. అధికారం కోల్పోవడం వల్ల నేనూ ఇబ్బంది పడ్డా. ప్రజలూ ఇక్కట్లపాలయ్యారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News July 3, 2024

పవిత్రమైన ఆశయంతో అమరావతిని ప్రారంభించాం: CM చంద్రబాబు

image

AP: అమరావతి నిర్మాణాన్ని ఓ పవిత్రమైన ఆశయంతో ప్రారంభించామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ల్యాండ్ ఇవ్వడానికి జనం ముందుకొచ్చారు. కానీ వారికి డబ్బులెలా ఇవ్వాలి? అప్పుడే ల్యాండ్ పూలింగ్ ఐడియా వచ్చింది. అమరావతి ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాండ్ పూలింగ్. ప్రపంచ బ్యాంకు దీన్ని ఓ కేస్ స్టడీగా ప్రజెంట్ చేసింది. భూములు ఇచ్చిన రైతులకు ఏడాది రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గుర్తుచేసుకున్నారు.

News July 3, 2024

నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్

image

ICC T20 ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అగ్రస్థానానికి దూసుకెళ్లారు. 222 పాయింట్లతో ఆయన టాప్‌ ప్లేస్‌కు చేరారు. ఆ తర్వాత వనిందు హసరంగ, స్టోయినిస్, సికందర్ రజా, షకీబ్ ఉన్నారు. బ్యాటర్ల విభాగంలో ఆసీస్ ఓపెనర్ హెడ్ టాప్‌లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. బౌలర్ల విభాగంలో అన్రిచ్ నోర్ట్జే తొలి స్థానంలో ఉండగా, అక్షర్ పటేల్ ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నారు.

News July 3, 2024

రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నా ఉపేక్షించం: భట్టి

image

TG: ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు. ఇక త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని భట్టి వెల్లడించారు. గత ఐదేళ్లలో కనీసం రూ.లక్ష కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు.

News July 3, 2024

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సెషన్‌ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో 79,986 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162 పాయింట్లు ఎగిసి 24,286కు చేరింది. మెటల్, బ్యాంకింగ్ రంగాలు రాణించడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. HDFC బ్యాంక్ షేర్ 3శాతం వృద్ధి చెంది ₹1794కు చేరింది. ఇది 52 వారాల గరిష్ఠం.

News July 3, 2024

‘కల్కి’: 6 రోజుల్లో రూ.680 కోట్లు!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 6 రోజుల్లోనే రూ.680+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీకెండ్‌లో రోజుకు రూ.100+ కోట్లు సాధించిన ఈ మూవీ సోమ, మంగళ వారాల్లోనూ 50+ కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించాయి. వచ్చే వీకెండ్‌లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

News July 3, 2024

కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జులై 12 వరకు పొడిగించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు జులై 5న విచారించనుంది. కాగా కొన్ని నెలలుగా కేజ్రీవాల్ తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News July 3, 2024

15 రోజుల్లో కుప్పకూలిన 7 బ్రిడ్జ్‌లు

image

బిహార్‌లో మరో బ్రిడ్జ్ కూలిపోయింది. సివాన్ జిల్లాలోని గండకి నదిపై నిర్మించిన వంతెన ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. పలు గ్రామాలకు వారధిగా ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా రాష్ట్రంలో 15 రోజుల్లో ఏడు బ్రిడ్జ్‌లు కూలిపోవడం గమనార్హం. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.