India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హింసను, విద్వేషాన్ని వ్యాపింపజేసే బీజేపీకి హిందూధర్మంలోని ప్రాథమిక సిద్ధాంతాలు తెలియడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడిని పిరికిపంద చర్య పేర్కొన్నారు. ఈ హింసాత్మక దాడి బీజేపీ, సంఘ్ పరివార్‌పై తన అభిప్రాయాన్ని బలపరుస్తుందని Xలో పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని, ఆ రాష్ట్రంలో INDIA కూటమి గెలుస్తుందని మరోసారి చెప్పారు.
నీట్‌లో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో దేశానికి దాని అవసరం లేదని TVK చీఫ్, నటుడు విజయ్ అన్నారు. ‘ప్రజలు నీట్‌పై నమ్మకాన్ని కోల్పోయారు. TN ప్రభుత్వం నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూ పాస్ చేసిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నా. రాష్ట్ర ప్రజల ఎమోషన్లతో ఆడుకోవద్దని కేంద్రానికి నా విజ్ఞప్తి. విద్యను ఉమ్మడి(కేంద్రం, రాష్ట్రం) జాబితా నుంచి రాష్ట్ర జాబితాలో చేర్చాలి’ అని పార్టీ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ గౌరవ్ ద్వివేది కోరారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 121 మంది మరణించగా మరో 20 మందిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మాస్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో విశ్వక్‌సేన్ తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ ‘లైలా’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు జరగ్గా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లేడీ గెటప్‌లో విశ్వక్ బ్యూటిఫుల్‌గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా 2025 FEB 14న మూవీ రిలీజ్ కానుంది.
కల్కి సినిమాలో తన భార్య దీపికా పదుకొణె అత్యద్భుతంగా నటించారని బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రశంసించారు. భారతీయ సినిమాలో కల్కి ఉత్తమ చిత్రమని ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి రణ్‌వీర్ సినిమా చూశారు. ప్రభాస్, కమల్ హాసన్ నటనతో అదరగొట్టారని, తన లాంటి అమితాబ్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని పేర్కొన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూ.గో., ప.గో., కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా అనుమతించారని చెప్పారు. ఈ క్రమంలో మీడియా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా రేపు ఉదయం కల్లా విమానం ఢిల్లీ చేరే అవకాశముంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80వేల మార్క్ తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
మహేశ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘SSMB29’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తారని సమాచారం. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సలార్ సినిమాలో వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Sorry, no posts matched your criteria.