India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత్‌లోకి చొరబడేందుకు సరిహద్దు వెంట 50 మందికి పైగా ఉగ్రవాదులు నక్కిఉన్నట్లు ఓ సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. వారిని అడ్డుకునేందుకు భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. అఖ్నూర్ సెక్టార్ నియంత్రణ రేఖ వెంట ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు చెప్పారు. ప్రతికూల పరిస్థితులుండే శీతాకాలంలో ఉగ్రమూకలు ఇండియాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తాయని, కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్ మహిళలతో మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన భారత ఓపెనర్ స్మృతి మంధాన ఓ అరుదైన రికార్డును అందుకున్నారు. ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(8) చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో మిథాలీ రాజ్(7), హర్మన్ ప్రీత్ కౌర్(6) ఉన్నారు. ఓవరాల్‌గా వన్డేల్లో లానింగ్(ఆసీస్) 15 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా 3 వన్డేల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
✒ Awkward× Adroit, clever
✒ Barbarous× Civilized
✒ Bleak× Bright, Pleasant
✒ Bewitching× Repulsive, Repugnant
✒ Baroque× Plain, unadorned
✒ Brittle× Tough, Enduring
✒ Barrier× Link, Assistance
✒ Baffle× Facilitate, Clarify
✒ Bustle× Slowness, Quiet
అమెరికా చరిత్రలో నేటికీ పరిష్కృతం కాని మిస్టరీ ఇది. 1971, నవంబరు 24న నార్త్‌వెస్ట్ ఓరియెంట్ విమానంలో డాన్ కూపర్ అనే ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను పిలిచి సూట్‌కేస్‌లో ఉన్న బాంబ్ చూపించాడు. 2 లక్షల డాలర్లు కావాలని డిమాండ్ చేశాడు. సియాటెల్‌లో ప్రయాణికుల్ని బయటికి వదిలేసి డబ్బులు తీసుకుని, నెవాడా వెళ్లాలని పైలట్లకు సూచించాడు. నెవాడా వెళ్లేసరికి డబ్బుతో మాయమయ్యాడు. అతడెవరన్నది నేటికీ అంతుచిక్కలేదు.
తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంట దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల భారత్, చైనా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. గాల్వాన్ లోయలో దళాల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా అనేక కమాండర్ స్థాయి చర్చల అనంతరం సరిహద్దుల్లో శాంతికి 2 దేశాలు అంగీకారం తెలిపాయి.
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జను లా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
తాత్పర్యం: కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు. ఆ బిడ్డ గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నపుడు తండ్రికి నిజమైన ఆనందం వస్తుంది.
AP: జగన్-షర్మిల వివాదంపై విజయమ్మ రాసిన <<14483905>>లేఖపై<<>> YCP స్పందించింది. ఆమెను అమితంగా గౌరవిస్తామని చెబుతూ కొన్ని అంశాలను బహిరంగ లేఖ ద్వారా వెల్లడించింది. ‘జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ప్రస్తావించకపోవడం పక్కదోవపట్టించడమే. షర్మిల ఒత్తిళ్లకు లొంగి ఆమె ఇలా వ్యవహరించారు. షర్మిల ఎన్ని విమర్శలు చేసినా జగన్ ఓపికతో భరించారు. రచ్చకెక్కింది ఎవరు? పరువు తీసింది ఎవరు?’ అని ప్రశ్నించింది.
AP: రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిధ అవసరాలకు ఏటా దాదాపు 1,500 టన్నుల ఆవు నెయ్యి అవసరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నాణ్యమైన నెయ్యి సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించామన్నారు. ఇది 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. కాగా కేజీ నెయ్యి తయారీకి సుమారు 25 లీటర్ల పాలు అవసరమవుతాయని డెయిరీ నిర్వాహకులు మంత్రికి వివరించారు.
✒ 1883: ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి కన్నుమూత
✒ 1909: భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబా జననం
✒ 1910: రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ కన్నుమూత
✒ 1930: ప్రముఖ ఇన్వెస్టర్, కుబేరుడు వారెన్ బఫెట్ జననం
✒ 1945: ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు సభ్యత్వం
✒ 1990: దర్శక, నిర్మాత, నటుడు వి.శాంతారాం మరణం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.