News October 30, 2024

ఆవు నెయ్యి సేకరణకు నిపుణుల కమిటీ: మంత్రి ఆనం

image

AP: రాష్ట్రంలోని దేవాలయాల్లో వివిధ అవసరాలకు ఏటా దాదాపు 1,500 టన్నుల ఆవు నెయ్యి అవసరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నాణ్యమైన నెయ్యి సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించామన్నారు. ఇది 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. కాగా కేజీ నెయ్యి తయారీకి సుమారు 25 లీటర్ల పాలు అవసరమవుతాయని డెయిరీ నిర్వాహకులు మంత్రికి వివరించారు.

Similar News

News November 5, 2024

ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు

image

ప్ర‌భుత్వ నియామ‌కాల్లో మ‌హిళ‌ల‌కు ఉన్న 33% రిజ‌ర్వేష‌న్ల‌ను 35 శాతానికి పెంచేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు CM మోహ‌న్ యాద‌వ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్‌ భేటీలో నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో అన్ని ర‌కాల ప్ర‌భుత్వ నియామకాల్లో (ఫారెస్ట్ మినహా) మహిళలకు 35% రిజర్వేషన్లు అమలుకానున్నాయి. మహిళా సాధికారతలో ఈ నిర్ణయం కీలక ముందడుగని డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లా పేర్కొన్నారు.

News November 5, 2024

భారత్ బ్రాండ్: రూ.30కే గోధుమ పిండి, రూ.34కే బియ్యం

image

కేంద్రం భారత్ బ్రాండ్ రెండో దశను ఆవిష్కరించింది. కాస్త ధరలు పెంచి రూ.30కే కేజీ గోధుమ పిండి, రూ.34కే KG బియ్యం వినియోగదారులకు ఇవ్వనుంది. 5-10 KGల బ్యాగులను NCCF, కేంద్రీయ భండార్, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా అమ్మనుంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు దీనిని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఫేజ్-1లో రూ.27.50కే కేజీ గోధుమ పిండి, రూ.29కే కిలో బియ్యం అందించింది.

News November 5, 2024

US Elections: డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం

image

న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో పోలింగ్ ముగిసింది. తొలి ఫ‌లితం కూడా వ‌చ్చేసింది. అర్హులైన ఓటర్లు అతిత‌క్కువగా ఉండే ఈ ప్రాంతంలో 1960 నుంచి మిగిలిన రాష్ట్రాల కంటే ముందే పోలింగ్ జ‌రుగుతోంది. ఈ ఫ‌లితాల్లో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌న‌కు చెరో మూడు చొప్పున బ్యాలెట్ ఓట్లు ద‌క్కాయి. యూఎస్-కెనడా సరిహద్దులోని ఈ పట్టణ ప్రజలు గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లకు మద్దతు ఇచ్చారు.