news

News October 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 30, 2024

నిర్మాణాత్మక విమర్శలనే స్వీకరిస్తాం: విజయ్

image

రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం(TVK) కీలక పోషిస్తుందని ఆ పార్టీ చీఫ్, నటుడు విజయ్ వెల్లడించారు. తాము నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం పొందేందుకు తీవ్రంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 27న ఆయన నిర్వహించిన తొలి మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

News October 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 30, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: అక్టోబర్ 30, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:00 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:14 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:09 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:45 గంటలకు
✒ ఇష: రాత్రి 6.59 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 30, 2024

శుభ ముహూర్తం

image

✒ తేది: అక్టోబర్ 30, బుధవారం
✒ త్రయోదశి: మధ్యాహ్నం 1.15 గంటలకు
✒ హస్త: రాత్రి 9.43 గంటలకు
✒ వర్జ్యం: లేదు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.28 నుంచి మధ్యాహ్నం 12.14 గంటల వరకు

News October 30, 2024

TODAY HEADLINES

image

✭70 ఏళ్లు దాటిన వారు ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలి: PM మోదీ
✭TG: ఏడాదిలో కేసీఆర్ అనే పదం కనిపించదు: CM రేవంత్
✭నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ప్రారంభం: CM
✭AP: గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
✭ఆస్తుల పంపకం అవాస్తవం: విజయమ్మ
✭ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ: TDP
✭విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: మంత్రి గొట్టిపాటి
✭TG: కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: KTR

News October 30, 2024

అన్నీ ఆడ నదులే.. ఆ రెండూ తప్ప!

image

గంగా, గోదావరి, యమున.. ఇలా మన దేశంలో అన్ని నదులకు స్త్రీ పేర్లే ఉంటాయి. కానీ సోన్, బ్రహ్మపుత్ర నదులు మాత్రం దీనికి మినహాయింపు. MPలో పుట్టిన సోన్, బిహార్‌లో గంగానదిలో కలుస్తుంది. బంగారు రంగులో కనిపిస్తుందని దాన్ని సోన్ అని పిలుస్తారు. ఇక హిమాలయాల నుంచి వచ్చే బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మదేవుడి కొడుకుగా భావిస్తారు. ఈ నది టిబెట్, భారత్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది.

News October 30, 2024

PBKS సంచలన నిర్ణయం: అర్ష్‌దీప్ రిలీజ్?

image

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RTM ద్వారా మళ్లీ అతడిని దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నిర్ణయంపై పంజాబ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది ‘బిగ్గెస్ట్ బ్లండర్’ అని, ఒక్కసారి వేలంలోకి వెళ్లాక అర్ష్‌దీప్‌ను మళ్లీ దక్కించుకోవడం కష్టమని వారు అంటున్నారు. కాగా అర్ష్‌దీప్ ఐదేళ్లుగా పంజాబ్ తరఫున ఆడుతున్నారు.

News October 30, 2024

రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

News October 30, 2024

మందుబాబులకు మరో గుడ్‌న్యూస్!

image

AP: రాష్ట్రంలోని మద్యం షాపుల్లోకి త్వరలోనే మరిన్ని కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం తక్కువ ధరకే క్వాలిటీ మద్యం అందిస్తున్నామని, ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ఓ కమిటీ వేశామని, నివేదిక రాగానే రేట్లు తగ్గిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని కొల్లు స్పష్టం చేశారు.