News October 30, 2024
రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Similar News
News November 14, 2024
ఎట్టకేలకు రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తి
రిలయన్స్, డిస్నీ+హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తైంది. ఈ సంస్థను జియో స్టార్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. రూ.70,353 కోట్లతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యంగా నిలిచింది. ఈ కంపెనీలో రిలయన్స్ వాటా 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84 % వాటా ఉంటుంది. ఈ రెండింటిలోని 100కు పైగా ఛానళ్లు ఒకే చోటకు రానున్నాయి.
News November 14, 2024
వారికి న్యాయ సహాయం చేస్తాం: వైసీపీ
AP: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు YCP కీలక నిర్ణయం తీసుకుంది. వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శ్రీకాకుళం-అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్, తూర్పుగోదావరి-జక్కంపూడి రాజా, వంగా గీత, గుంటూరు-విడదల రజినీ, డైమండ్ బాబు, ప్రకాశం-TJR సుధాకర్, VRరెడ్డి, నెల్లూరు-R ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు- గురుమూర్తి, మోహిత్ రెడ్డి, కడప-సురేశ్ బాబు, రమేశ్ యాదవ్.
News November 14, 2024
VIRAL: తాజ్‌మహల్ కనిపించట్లేదు!
ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి కాలుష్యంగా మారడంతో కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేకపోతున్నారు. దీనిని కళ్లకు కట్టినట్లు చూపెట్టే ఫొటోలు వైరలవుతున్నాయి. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లిన పర్యాటకులు ‘తాజ్‌మహల్ కనిపించట్లేదు.. ఎక్కడుందో కనిపెట్టాలి’ అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.