news

News October 30, 2024

PBKS సంచలన నిర్ణయం: అర్ష్‌దీప్ రిలీజ్?

image

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RTM ద్వారా మళ్లీ అతడిని దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నిర్ణయంపై పంజాబ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది ‘బిగ్గెస్ట్ బ్లండర్’ అని, ఒక్కసారి వేలంలోకి వెళ్లాక అర్ష్‌దీప్‌ను మళ్లీ దక్కించుకోవడం కష్టమని వారు అంటున్నారు. కాగా అర్ష్‌దీప్ ఐదేళ్లుగా పంజాబ్ తరఫున ఆడుతున్నారు.

News October 30, 2024

రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

image

ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

News October 30, 2024

మందుబాబులకు మరో గుడ్‌న్యూస్!

image

AP: రాష్ట్రంలోని మద్యం షాపుల్లోకి త్వరలోనే మరిన్ని కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం తక్కువ ధరకే క్వాలిటీ మద్యం అందిస్తున్నామని, ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ఓ కమిటీ వేశామని, నివేదిక రాగానే రేట్లు తగ్గిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని కొల్లు స్పష్టం చేశారు.

News October 30, 2024

ఈ పదాలకు అర్థం తెలుసా?

image

హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మార్కాపురం, అనంతపురం.. తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు చివర్లో ఇలా బాద్ లేదా పురం అని కనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆబాద్ అంటే నివాసం లేదా ఆహారం లభించే నివాసయోగ్యమైన స్థలమని అర్థం. వాటిని స్థాపించిన వారు లేదా ప్రముఖుల పేర్లకు చివర ఆబాద్ పేరిట ప్రాంతాలను పిలుస్తున్నాం. ఇక పురం అంటే పట్టణమని అర్థం. ఈ అర్థంలోనే కొన్ని ఊళ్ల చివర పురం అన్న పదాన్ని వాడటం ప్రారంభమైంది.

News October 29, 2024

పంత్ కాదు.. భారత్‌ని పూజారా కాపాడాడు: టిమ్ పెయిన్

image

2020-21లో తమ దేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత్‌ను కాపాడింది పూజారానేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ పేర్కొన్నారు. ‘ఆ సిరీస్ విజయంలో అందరూ పంత్ గురించే మాట్లాడతారు. నిజానికి భారత్‌ను గెలిపించింది పుజారా. మాకు అతడో గోడలా అడ్డం నిలబడిపోయాడు. బౌలర్లను విసిగించి, అలసిపోయేలా చేశాడు. బంతి తగిలి ఒళ్లు కమిలిపోతున్నా ఓ రాయిలా క్రీజులో పాతుకుపోయాడు’ అని కొనియాడారు.

News October 29, 2024

యశ్ ‘టాక్సిక్’ షూటింగ్ కోసం చెట్లు నరికివేత: క్లారిటీ

image

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం చెట్లు నరికివేస్తున్నట్లు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖాండ్రే ఆరోపించారు. దీనిపై శాండల్‌వుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. కాగా శాటిలైట్ చిత్రాలను చూస్తుంటే అక్కడ చెట్లు కొట్టేసిన ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మూవీ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

News October 29, 2024

ఈ లిస్ట్‌లో మీ మండలం ఉందా?

image

AP: ఖరీఫ్ సీజన్‌లో 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరవు, మరో 27 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. ఈ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పింది. పైనున్న ఇమేజ్‌లో మీ మండలం ఉందా?

News October 29, 2024

పవన్ కళ్యాణ్‌తో హోంమంత్రి అనిత భేటీ

image

AP: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, దీపావళి భద్రతా ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించేందుకు హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని 185 ఫైర్ స్టేషన్ల సిబ్బంది ఎక్కడ ప్రమాదం జరిగినా నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటారు. బాణసంచా అక్రమ తయారీపై 100 లేదా 101కు ఫోన్ చేసి పోలీస్, అగ్నిమాపకశాఖలకు ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

News October 29, 2024

అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం: చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి ANR జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో నిన్న ఘనంగా జరిగిన ఈ వేడుకకు నాగార్జున, చిరంజీవి కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా నాగార్జున, అఖిల్, నాగచైతన్యతో కలిసి తాను, రామ్‌చరణ్ దిగిన ఫొటోను చిరు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అక్కినేని వారసులతో ఓ సరదా సాయంత్రం అని క్యాప్షన్ ఇచ్చారు. ఒకే ఫ్రేమ్‌లో బ్లాక్ సూట్‌లో స్టార్‌లు మెరిసిపోతున్న ఈ ఫొటో వైరలవుతోంది.

News October 29, 2024

షమీకి గుజరాత్ టైటాన్స్ ఝలక్?

image

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పేసర్ మహ్మద్ షమీని వదిలేయాలని గుజరాత్ టైటాన్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఏడాదికిపైగా ఆయన ఆటకు దూరం కావడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రషీద్ ఖాన్, సాయి సుదర్శన్‌, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌‌‌లను అట్టి పెట్టుకుంటుందని టాక్.