India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ తేది: అక్టోబర్ 30, బుధవారం
✒ త్రయోదశి: మధ్యాహ్నం 1.15 గంటలకు
✒ హస్త: రాత్రి 9.43 గంటలకు
✒ వర్జ్యం: లేదు
✒ దుర్ముహూర్తం: ఉదయం 11.28 నుంచి మధ్యాహ్నం 12.14 గంటల వరకు
✭70 ఏళ్లు దాటిన వారు ఆయుష్మాన్ కార్డు తీసుకోవాలి: PM మోదీ
✭TG: ఏడాదిలో కేసీఆర్ అనే పదం కనిపించదు: CM రేవంత్
✭నవంబర్ 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు ప్రారంభం: CM
✭AP: గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
✭ఆస్తుల పంపకం అవాస్తవం: విజయమ్మ
✭ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ: TDP
✭విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: మంత్రి గొట్టిపాటి
✭TG: కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి: KTR
గంగా, గోదావరి, యమున.. ఇలా మన దేశంలో అన్ని నదులకు స్త్రీ పేర్లే ఉంటాయి. కానీ సోన్, బ్రహ్మపుత్ర నదులు మాత్రం దీనికి మినహాయింపు. MPలో పుట్టిన సోన్, బిహార్‌లో గంగానదిలో కలుస్తుంది. బంగారు రంగులో కనిపిస్తుందని దాన్ని సోన్ అని పిలుస్తారు. ఇక హిమాలయాల నుంచి వచ్చే బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మదేవుడి కొడుకుగా భావిస్తారు. ఈ నది టిబెట్, భారత్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది.
పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RTM ద్వారా మళ్లీ అతడిని దక్కించుకోవాలని ఆ జట్టు భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ నిర్ణయంపై పంజాబ్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఇది ‘బిగ్గెస్ట్ బ్లండర్’ అని, ఒక్కసారి వేలంలోకి వెళ్లాక అర్ష్‌దీప్‌ను మళ్లీ దక్కించుకోవడం కష్టమని వారు అంటున్నారు. కాగా అర్ష్‌దీప్ ఐదేళ్లుగా పంజాబ్ తరఫున ఆడుతున్నారు.
ఏపీలో రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
AP: రాష్ట్రంలోని మద్యం షాపుల్లోకి త్వరలోనే మరిన్ని కొత్త బ్రాండ్స్ అందుబాటులోకి తెస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం తక్కువ ధరకే క్వాలిటీ మద్యం అందిస్తున్నామని, ధరలు తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ఓ కమిటీ వేశామని, నివేదిక రాగానే రేట్లు తగ్గిస్తామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదని కొల్లు స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మార్కాపురం, అనంతపురం.. తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు చివర్లో ఇలా బాద్ లేదా పురం అని కనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆబాద్ అంటే నివాసం లేదా ఆహారం లభించే నివాసయోగ్యమైన స్థలమని అర్థం. వాటిని స్థాపించిన వారు లేదా ప్రముఖుల పేర్లకు చివర ఆబాద్ పేరిట ప్రాంతాలను పిలుస్తున్నాం. ఇక పురం అంటే పట్టణమని అర్థం. ఈ అర్థంలోనే కొన్ని ఊళ్ల చివర పురం అన్న పదాన్ని వాడటం ప్రారంభమైంది.
2020-21లో తమ దేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత్‌ను కాపాడింది పూజారానేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ పేర్కొన్నారు. ‘ఆ సిరీస్ విజయంలో అందరూ పంత్ గురించే మాట్లాడతారు. నిజానికి భారత్‌ను గెలిపించింది పుజారా. మాకు అతడో గోడలా అడ్డం నిలబడిపోయాడు. బౌలర్లను విసిగించి, అలసిపోయేలా చేశాడు. బంతి తగిలి ఒళ్లు కమిలిపోతున్నా ఓ రాయిలా క్రీజులో పాతుకుపోయాడు’ అని కొనియాడారు.
కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం చెట్లు నరికివేస్తున్నట్లు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖాండ్రే ఆరోపించారు. దీనిపై శాండల్‌వుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. కాగా శాటిలైట్ చిత్రాలను చూస్తుంటే అక్కడ చెట్లు కొట్టేసిన ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మూవీ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
AP: ఖరీఫ్ సీజన్లో 5 జిల్లాల్లోని 54 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. వీటిలో 27 తీవ్ర కరవు, మరో 27 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా గుర్తించింది. అన్నమయ్య జిల్లాలో 19, చిత్తూరు 16, శ్రీసత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు జిల్లాలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఏర్పడినట్లు పేర్కొంది. ఈ మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు చెప్పింది. పైనున్న ఇమేజ్‌లో మీ మండలం ఉందా?
Sorry, no posts matched your criteria.