news

News April 25, 2024

ట్విటర్‌లో ‘లుక్ బిట్వీన్’ ట్రెండ్

image

ట్విటర్‌లో ‘లుక్ బిట్వీన్ యువర్ కీ బోర్డ్’ పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. రోహిత్ ఫొటోతో ‘లుక్ బిట్వీన్ R అండ్ Y ఆన్ యువర్ కీ బోర్డ్’ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. అంటే వాటి మధ్య ఉండే T అంటే ట్రోఫీస్ అన్నమాట. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు రెండు అక్షరాలను పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లే కాక ప్రముఖులు కూడా దీన్ని అందిపుచ్చుకుని తమదైన శైలిలో ట్వీట్‌లు చేస్తున్నారు.

News April 25, 2024

మోదీ గ్యారంటీ భారత్‌కు పరిమితం కాదు: జైశంకర్

image

పీఎం మోదీ ఇచ్చే గ్యారంటీ భారత్‌కు మాత్రమే పరిమితం కాదని కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మోదీ గ్యారంటీ దేశ సరిహద్దుల వద్ద ఆగిపోదు. విదేశాల్లోని భారతీయుల భద్రత కూడా మాకు అత్యంత ముఖ్యం. కొవిడ్ అయినా, యుద్ధాలైనా మనవారిని రక్షించేందుకు మేం అన్నివేళలా సిద్ధం. గత ప్రభుత్వాల విదేశాంగ విధానం ఓటు బ్యాంకే ప్రామాణికంగా నడిచింది’ అని స్పష్టం చేశారు.

News April 25, 2024

దస్తగిరికి భద్రత పెంపు

image

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రతను EC పెంచింది. రేపు CM జగన్‌తో పాటు దస్తగిరి కూడా నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతను ఫోర్ ప్లస్ ఫోర్, టెన్ ప్లస్‌కు పెంచి ఇవాళ, రేపు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. కాగా తన నామినేషన్ అడ్డుకోవాలని YCP చూస్తోందని దస్తగిరి ఆరోపిస్తున్నారు. తనపై దాడికి యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో నామినేషన్ కార్యక్రమం రేపటికి మార్చుకున్నట్లు దస్తగిరి తెలిపారు.

News April 25, 2024

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రేపటి నుంచి మే 2వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News April 25, 2024

తెలంగాణలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారు

image

TG: రాష్ట్రంలో పీఎం మోదీ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30న ఆందోల్‌లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. ఇక వచ్చే నెల 3,4 తేదీల్లోనూ రాష్ట్రంలో పర్యటిస్తారు. 3న వరంగల్‌ పార్లమెంటు పరిధిలో ఒక సభ, భువనగిరి, నల్గొండ స్థానాలకు కలుపుతూ మరో సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజు నారాయణపేట, వికారాబాద్‌లో జరిగే సభల్లో ప్రధాని పాల్గొంటారని పీఎంవో వర్గాలు తెలిపాయి.

News April 25, 2024

పుర్రెలతో తమిళనాడు రైతుల నిరసన

image

ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమిళనాడు రైతులు నిన్న ఎముకలు, పుర్రెలతో బైఠాయించి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇవి ఆత్మహత్య చేసుకున్న రైతులవని నిరసనకారులు చెబుతున్నారు. ‘వ్యవసాయంలో ఆదాయం రెట్టింపు, నదుల అనుసంధానం చేస్తామని 2019లో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ అవి నెరవేరలేదు. ఒకవేళ కేంద్రం మా డిమాండ్స్ తీర్చకుంటే వారణాసిలో మోదీపై పోటీ చేస్తాం. మేము ఏ రాజకీయ పార్టీకి చెందిన వారము కాదు’ అని తెలిపారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాలు విడుదల.. వివరాలు

image

TG: ఫస్ట్ ఇయర్‌లో 2.87 లక్షల మంది, సెకండ్ ఇయర్‌లో 3.22 లక్షల మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో 60.01%, సెకండ్ ఇయర్‌లో 64.18% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 68.35%, బాలురు 51.05% మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలికలు 72.53%, బాలురు 56.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా 71.07శాతంతో టాప్ ప్లేస్‌లో, సెకండియర్‌లో ములుగు 82.95శాతంతో తొలి స్థానంలో నిలిచింది.

News April 25, 2024

రూ.25 వేల నాణేలతో నామినేషన్

image

TG: ఎన్నికల వేళ ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. పేరాల మానసా రెడ్డి అనే మహిళా అభ్యర్థి తన నామినేషన్ వేసేందుకు డిపాజిట్ కింద చెల్లించాల్సిన రూ.25 వేలను చిల్లర రూపంలో చెల్లించారు. రూపాయి నుంచి పది రూపాయల వరకు నాణేలను గంపలో తీసుకొచ్చి నామినేషన్ వేశారు.

News April 25, 2024

BREAKING: ఇంటర్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. మరికొద్ది క్షణాలలో అందరికంటే ముందుగా వే2న్యూస్ యాప్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా దీన్ని షేర్ చేయొచ్చు. Be Ready

News April 25, 2024

నామినేషన్ల దాఖలుకు రేపే లాస్ట్

image

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు త్వరపడాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలో లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. కాగా ఈ నాలుగో దశలో తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, UP, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.