News April 25, 2024
నామినేషన్ల దాఖలుకు రేపే లాస్ట్

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు త్వరపడాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలో లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది. ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. కాగా ఈ నాలుగో దశలో తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, UP, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News January 16, 2026
రేపు కాకినాడ.. ఎల్లుండి అమరావతిలో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించి అమ్మోనియం ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఆయన అమరావతిలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. ఈ నెల 19న సీఎం దావోస్ పర్యటనకు వెళ్తారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న విషయం తెలిసిందే.
News January 16, 2026
మరియా గొప్ప మహిళ: ట్రంప్

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
News January 16, 2026
క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.


