India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నామినేషన్ రిజెక్ట్ కావడంతో బీజేపీ విజయానికి పరోక్షంగా కారణమైన సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన త్వరలోనే బీజేపీలో చేరనున్నారట. ఆయన ఫోన్ స్విఛాఫ్ ఉండటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు నీలేశ్ ఇంటి ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. కాగా ప్రతిపాదకుల సంతకాలు సరిగా లేకపోవడంతో నీలేశ్ నామినేషన్ రిజెక్ట్ అయింది.
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. సిద్దిపేటలో జరిగే బీజేపీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ రోజు ఉదయం 11.10 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేట వెళ్లనున్నారు. ఆ తర్వాత కారులో బహిరంగ సభ ప్రదేశానికి చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన భువనేశ్వర్ వెళ్తారు.
AP: వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా.. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అల్లరి నరేశ్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘సుడిగాడు’ ఒకటి. స్పూఫ్ కామెడీ సీన్లతో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్‌పై ఓ ఈవెంట్‌లో నరేశ్ కీలక అప్డేట్ ఇచ్చారు. సుడిగాడు-2 కోసం తానే రచయితగా మారి కథ రాస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఆ సినిమాను చూడొచ్చని చెప్పారు.
T20 World cup విషయంలో ఐపీఎల్‌లో విఫలమవుతున్న వారిని పక్కన పెట్టి, రాణిస్తున్నవారిని తీసుకోవాలన్న చర్చ నడుస్తోంది. విరాట్, రోహిత్, బుమ్రా, సూర్య, గిల్, జైస్వాల్, రాహుల్, రింకూ సెలక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీరితో పాటు పరాగ్, తిలక్, అభిషేక్, శశాంక్, దూబే, డీకే, చాహల్, నటరాజన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. IPLలో పంత్, జడ్డూ, పాండ్య, అర్షదీప్, సిరాజ్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.
TG: ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీటును కాంగ్రెస్ నేత రామసహాయం రఘురాంరెడ్డికి కేటాయించినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఆయన 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా హీరో వెంకటేశ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి రఘురాంరెడ్డి వియ్యంకుడు. వీరిద్దరి కూతుళ్లను రఘురాం కుమారులు వివాహం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ మారింది. ఇప్పటి వరకు ‘అబ్ కీ బార్ 400 పార్’ అన్న నినాదంతో ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. నిన్న గుజరాత్‌లోని సూరత్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఏ నేతలు ‘అబ్ కీ బార్ 399 పార్’ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా 1951 నుంచి ఇప్పటివరకు పోటీ లేకుండా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరుకుంది.
AP: వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26న తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకుని పలు జనాకర్షక పథకాలను ప్రకటిస్తారని సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురం నుంచి మళ్లీ గెలుస్తారని నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. ‘థరూర్ ఈ నియోజకవర్గానికి చాలా చేశారు. మళ్లీ ఆయనే గెలుస్తారు. ఆయన నాకు మిత్రుడని నేను మద్దతు ఇవ్వడం లేదు. గడచిన దశాబ్ద కాలంగా ఈ దేశ ప్రతినిధిగా థరూర్ నమ్మకాన్ని ఇచ్చారు’ అని పేర్కొన్నారు. తిరువనంతపురంలో థరూర్ 2009 నుంచి గెలుస్తుండటం గమనార్హం.
ఆర్సీబీకి ఇవాళ మర్చిపోలేని రోజు. ఇదే తేదీలో ఒక ఉత్తమ, ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 2013 ఏప్రిల్ 23న PWతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 263 పరుగుల అత్యధిక స్కోరు చేసింది. 2017 ఏప్రిల్ 23న KKRతో జరిగిన మ్యాచ్‌లో 49కే ఆలౌటై అత్యల్ప స్కోరు నమోదు చేసింది. కాగా ఈ సీజన్‌లో RCB ఘోర ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్క దాంట్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
Sorry, no posts matched your criteria.