news

News April 24, 2024

నేడు పవన్ కళ్యాణ్ నామినేషన్

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9.30కు చేబ్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ క్షేత్రం వరకు వెళ్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారు.

News April 24, 2024

విశాఖ-బెంగళూరు, HYD-అర్సికెరె మధ్య 58 స్పెషల్ ట్రైన్స్

image

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 30 వరకు శని, ఆదివారాల్లో విశాఖపట్నం- బెంగళూరు మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 25 నుంచి జూన్ 28 వరకు హైదరాబాద్-అర్సికెరె(కర్ణాటక), సికింద్రాబాద్-అర్సికెరె మధ్య 38 స్పెషల్ ట్రైన్స్ తిరగనున్నాయి. పైనున్న ఫొటోలలో రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చు.

News April 24, 2024

హైకోర్టు తీర్పు ముందుగానే బీజేపీకి ఎలా తెలిసింది?: మమతా బెనర్జీ

image

బెంగాల్‌లో 23వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన <<13101174>>తీర్పు<<>> పొలిటికల్ టర్న్ తీసుకుంది. ‘సోమవారం పెద్ద ఘటన జరగనుంది’ అని BJP నేత సువేందు అధికారి 2 రోజుల ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘హైకోర్టు తీర్పు ఎలా వస్తుందో ముందే ఎలా తెలుసు? ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే సువేందు చెప్పిన విస్ఫోటనమా?’ అని CM మమత ప్రశ్నించారు.

News April 24, 2024

వేములవాడ రాజన్నకు రికార్డు స్థాయి ఆదాయం

image

TG: వేములవాడ రాజన్న ఆలయానికి 2023-24లో రూ.119.72 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేడారం జాతర రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగి మంచి ఆదాయం సమకూరిందని చెప్పారు. 2021-22లో అత్యధికంగా రూ.87.78 కోట్లు రాగా, ఈసారి అదనంగా రూ.31 కోట్ల ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.32 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.21 కోట్లు, టికెట్ల విక్రయంతో రూ.22 కోట్లు సమకూరింది.

News April 24, 2024

ఎలక్షన్స్.. 9 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి

image

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో దాదాపు 9 లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తుందని వర్క్ ఇండియా CEO నీలేశ్ దుంగర్వాల్ వెల్లడించారు. ఎలక్షన్స్ సజావుగా సాగేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, కంటెంట్ రైటింగ్, సేల్స్ వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. పోటీ చేసే అభ్యర్థులు, పోలింగ్ స్టేషన్ల సంఖ్య, ఎన్నికల స్థాయిని బట్టి కూడా ఉపాధి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

News April 24, 2024

One Word Substitution- Person/People

image

☛ One who shows sustained enthusiastic action with unflagging vitality::- Indefatigable
☛ Someone who attacks cherished ideas or traditional institutions::- Iconoclast
☛ One who does not express himself freely::- Introvert
☛ Who behaves without moral principles::- Immoral
☛ One who is unable to pay his debts::- Insolvent

News April 24, 2024

కువైట్‌లో తొలిసారి హిందీలో రేడియో ప్రసారాలు

image

కువైట్‌లో తొలిసారి హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభించినట్లు అక్కడి ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 వరకు FM 93.3, 96.3 ఫ్రీక్వెన్సీల్లో ప్రోగ్రామ్స్ ప్రసారమవుతాయని తెలిపింది. దీనివల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని పేర్కొంది. కాగా ప్రస్తుతం కువైట్‌లో దాదాపు 10 లక్షల మంది ఇండియన్స్ నివసిస్తున్నారు.

News April 24, 2024

బీజేపీలో చేరి ఆప్తమిత్రులకు దూరమయ్యా: విజేందర్ సింగ్

image

ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో <<12988453>>చేరిన<<>> బాక్సర్ విజేందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయంతో పంజాబ్, హరియాణా, యూపీలోని ఆప్త మిత్రులకు దూరమయ్యానని చెప్పారు. ‘క్రీడల మాదిరిగానే రాజకీయాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సర్దుకుపోవడం కష్టమవడంతో పార్టీ మారాను. ప్లేస్ మార్చాను గానీ నేను మారలేదు. నా స్నేహితులకు మళ్లీ దగ్గరవుతాననే నమ్మకం ఉంది’ అని చెప్పారు.

News April 24, 2024

వేమన నీతి పద్యం- భావం

image

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణపు ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: దేవుని పూజల కంటే నిశ్చలమైన బుద్ధి ఉండటం మేలు. ఉత్తి మాటలు చెప్పడం కంటే మంచి మనస్సు ఉండాలి. వంశం గొప్పతనం కంటే వ్యక్తి మంచితనం ముఖ్యము.

News April 24, 2024

రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

image

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయన ఉత్తర, దక్షిణ భారతాల విభజన తీసుకొచ్చేలా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తెలిపింది. రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తమ పార్టీ అన్ని ప్రాంతాలను, భాషలను గౌరవిస్తుందని పేర్కొంది.