News April 24, 2024
బీజేపీలో చేరి ఆప్తమిత్రులకు దూరమయ్యా: విజేందర్ సింగ్
ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో <<12988453>>చేరిన<<>> బాక్సర్ విజేందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన నిర్ణయంతో పంజాబ్, హరియాణా, యూపీలోని ఆప్త మిత్రులకు దూరమయ్యానని చెప్పారు. ‘క్రీడల మాదిరిగానే రాజకీయాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సర్దుకుపోవడం కష్టమవడంతో పార్టీ మారాను. ప్లేస్ మార్చాను గానీ నేను మారలేదు. నా స్నేహితులకు మళ్లీ దగ్గరవుతాననే నమ్మకం ఉంది’ అని చెప్పారు.
Similar News
News January 18, 2025
అనుమానాలు పటాపంచలు.. CTలో బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానమేనన్న వార్తలకు తెరపడింది. ఇవాళ అతని పేరును సెలక్టర్లు ప్రకటించారు. దీంతో స్టార్ బౌలర్ కోలుకున్నట్లు పరోక్షంగా చెప్పినట్లయింది. BGTలో భారత బౌలింగ్ దళాన్ని బుమ్రా ఒంటి చేత్తో ముందుకు నడిపించిన విషయం తెలిసిందే. ట్రోఫీ కోల్పోయినప్పటికీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నారు.
News January 18, 2025
రాయలసీమను రతనాల సీమగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
AP, కేంద్రంలో NDA ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతి, పోలవరం పనులు ముందుకెళ్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లూ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోతున్నాయని చెప్పారు. మైదుకూరులో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి-పెన్నా, పోలవరం-బనకచర్ల అనుసంధానమైతే గేమ్‌ఛేంజర్ అవుతుందని పేర్కొన్నారు.
News January 18, 2025
సంజయ్‌ను ఉరి తీయండి: ప్రజల నినాదాలు
అభయ హత్యాచార కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌ను ఉరి తీయాలని కోర్టు బయట మెడిసిన్ విద్యార్థులు, ప్రజలు నినాదాలు చేశారు. ఇలా అయితేనే మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకు భయపడతారని అన్నారు. కాగా కేసు తీవ్రత దృష్ట్యా ఈ మధ్యాహ్నం భారీ బందోబస్తు మధ్య రాయ్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలతో పాటు 300 మందికి పైగా పోలీసులు కోర్టు చుట్టూ మోహరించారు.