India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ IPLలో SRH విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్థాన్ బ్యాటింగ్ సెన్సేషన్ రియాన్ పరాగ్ అదరగొడుతున్నారు. అభిషేక్ 7 మ్యాచుల్లో 215.96 SRతో 257రన్స్ చేసి ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. మరో ప్లేయర్ పరాగ్ 7 మ్యాచుల్లో 161.42SRతో 318రన్స్ చేసి మ్యాచ్ విన్నర్‌గా మారారు. దీంతో మరో వారం రోజుల్లో ప్రకటించే T20WC జట్టులో వీరికి ఛాన్స్ దొరుకుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
సూరత్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘వన్ నేషన్-నో ఎలక్షన్.. ఎన్నికల కమిషన్ పనితీరు బాగుంది’ అని పేర్కొన్నారు. సూరత్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది.
IPL-2024లో 250+ స్కోర్లు నమోదవుతున్నాయి. దీనిపై స్పందించిన సునీల్ గవాస్కర్.. ‘ప్రతి గ్రౌండ్‌లో బౌండరీ లైన్ల పరిధి పెంచాలి. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్‌కు, క్యాచ్‌కు తేడా లేదు. 2-3 మీటర్ల వరకు బౌండరీ పరిధి పెంచాలి. లేదంటే బౌలర్లు ఇబ్బంది పడతారు. క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య భీకరపోరు జరిగితేనే మ్యాచ్ ఆసక్తిగా ఉంటుంది. ప్రతిసారీ బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగినా బోర్ కొడుతుంది’ అని అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల్లో సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముకేశ్ దలాల్ అరుదైన ఘనత సాధించారు. గత 12 ఏళ్లలో ఇలా సీటు కైవసం చేసుకున్న తొలి ఎంపీగా నిలిచారు. దీంతో 1951 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరింది. చివరిసారిగా 2012లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలని సీఎస్ సూచించారు.
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ప్రస్తుతం 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 61 రన్స్ చేసింది. ప్రస్తుతం బట్లర్ 28*, జైస్వాల్ 31* క్రీజులో ఉన్నారు. RR విజయానికి 84 బంతుల్లో 119 రన్స్ కావాలి.
AP: విశాఖను CM జగన్ గంజాయి హబ్‌గా మార్చారని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు విశాఖలో ఉండటం బాధాకరం. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూ మాఫియా, సెటిల్‌మెంట్లే. రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తోంది. ఉత్తరాంధ్రలో వేల కోట్ల ఆస్తులు కొట్టేశారు. ఎవరివల్ల రాష్ట్రం బాగుంటుందో ప్రజలు ఆలోచించాలి. మేం రాగానే మెగా DSCపైనే తొలి సంతకం ‘ అని శృంగవరపుకోట సభలో స్పష్టం చేశారు.
ఐపీఎల్‌లో చాహల్ 200 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీలో తొలిసారి 50 వికెట్లు తీసిన బౌలర్ ఆర్పీ సింగ్. ఇక 100, 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా లసిత్ మలింగ రికార్డులకెక్కారు.
ముంబై ఇండియన్స్ టీమ్‌కు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అండగా నిలుస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలుపుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరుసగా 25, 64, 32, 6, 16*, 31, 34*, 65 రన్స్ చేసిన 21 ఏళ్ల వర్మ.. ముంబైకి బ్యాక్ బోన్‌గా మారారు. బ్యాటింగ్‌లో మంచి టచ్‌లో ఉన్న తిలక్‌ను T20WC కోసం భారత జట్టుకు ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఈ LS ఎన్నికల్లో BRS 8-10 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కాంగ్రెస్, BJP ప్రభుత్వాల మోసాలను సైతం వెలుగులోకి తేవాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సిరిసిల్లలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sorry, no posts matched your criteria.