India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘డిసెంబర్ 9న ఒక దొంగను ఓడగొట్టాం. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టాలి. ఆదిలాబాద్‌లో సీసీఐ సిమెంట్ పరిశ్రమను మోదీ, కేడీ కలిసి మూసేశారు. త్వరలోనే దాన్ని తిరిగి తెరిపిస్తాం. ఉచిత కరెంట్‌తో పేదల ఇళ్లు వెలుగుతుంటే మోదీ, కేసీఆర్ కడుపు మండుతోంది’ అని రేవంత్ విమర్శించారు.
బాలిక గర్భం దాల్చిన కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు చెప్పింది. 30 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతిచ్చింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లి బాలిక గర్భ విచ్ఛిత్తి కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ ఎదురవడంతో సుప్రీంకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన CJI జస్టిస్ చంద్రచూడ్ గర్భవిచ్ఛిత్తికి అనుమతించారు.
నెట్టింట సర్క్యులేట్ అవుతున్న తన డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై సైబర్ క్రైమ్ సెల్‌ను ఆయన ఆశ్రయించారు. రణ్‌వీర్ ఇటీవల వారణాసిలో పర్యటించారు. ఓ రాజకీయ పార్టీకి మద్దతునిస్తున్నట్లుగా ఏఐ సాయంతో ఆయన గొంతును మార్చిన దుండగులు, వీడియోకు ఆ ఆడియో జత చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల్ని ఆశ్రయించినట్లు రణ్‌వీర్ తరఫు ప్రతినిధులు తెలిపారు.
కర్ణాటకలోని మాండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడ రూ.622 కోట్ల ఆస్తులతో రెండో దశ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్లు, యూపీలోని మథుర నుంచి బీజేపీ అభ్యర్థి హేమమాలిని రూ.278 కోట్లతో ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. ఎన్నికల్లో 1,210 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
నిన్న జరిగిన 2 మ్యాచుల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్ల కెప్టెన్లకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానాలను విధించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కరన్‌కు మ్యాచ్ ఫీజులో 50శాతం కోత పడింది. ఇక KKRతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా RCB కెప్టెన్ డు ప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. మరోసారి స్లో ఓవర్ రేట్ తప్పు చేస్తే రెట్టింపు ఫైన్ విధిస్తామని కమిటీ స్పష్టం చేసింది.
సీబీఐ అరెస్ట్‌పై కవిత వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈడీ అరెస్ట్‌లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కాసేపట్లో విచారణకు రానుంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేశాయి. దీంతో ఆమె రెండు బెయిల్ పిటిషన్లు వేశారు.
AP: సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వాన్ని క్షేమంగా చూసుకుంటాయని YCP భావిస్తోంది. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక పథకంతో లబ్ధి పొందారని CM జగన్ సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దీంతో వారంతా ఓటు బ్యాంకుగా మారుతారని ఆశిస్తోంది. కానీ రాష్ట్రాభివృద్ధి అంశాన్ని ప్రతిపక్షాలు ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకుంటే ప్రజల ఆలోచన మారినా ఆశ్చర్యం అక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసుపై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2016 నాటి రిక్రూట్‌మెంట్ చెల్లదని పేర్కొంది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్ సీ, డీలో చేసిన నియామకాలన్నీ చట్ట విరుద్ధమని తెలిపింది. దీంతో నియమితులైన 23వేల మందికి పైగా ఉద్యోగులను వెంటనే తొలగించాలంటూ తీర్పు చెప్పింది. వీరందరూ నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో మొత్తం జీతాన్ని తిరిగివ్వాలని తెలిపింది.
జైల్లో ఢిల్లీ CM కేజ్రీవాల్ భద్రతను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. పిల్ వేసిన న్యాయ విద్యార్థికి రూ.75వేల ఫైన్ వేసింది. ఈసందర్భంగా పిటిషనర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఆయనకు సలహాలు ఇచ్చేందుకు మనం ఎవరు? అసలు నువ్వెవరు? నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావ్?’ అని పేర్కొంది.
పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.550 తగ్గి రూ.73,690కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.67,550గా నమోదైంది. సిల్వర్ రేట్ కేజీకి రూ.1000 దిగి రూ.89వేల వద్ద ఉంది.
Sorry, no posts matched your criteria.