India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. bse.ap.gov.in సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
TG: రాష్ట్రంలో ఒకవైపు ఎన్నికలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈక్రమంలోనే కొంతమంది తమ అభిమాన నేత ఫొటోలను పెళ్లి పత్రికపై ముద్రించి ప్రచారం చేస్తున్నారు. మెదక్(D) మహ్మద్‌నగర్‌కు చెందిన సురేశ్ నాయక్ తన తమ్ముడి పెళ్లి పత్రికపై BJP MP అభ్యర్థి రఘునందన్ ఫొటో ముద్రించారు. బంధువుల ఓట్లే పెళ్లికి బహుమతి అని రాసుకొచ్చారు. దీనిపై ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సురేశ్‌పై కేసు నమోదైంది.
భారత చెస్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించారు. ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. ఈక్రమంలో ఈ ఏడాది జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. ఆ టోర్నీలో ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌తో గుకేశ్ తలపడనున్నారు. ఈ యువ ఆటగాడు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ వద్ద శిక్షణ తీసుకోవడం గమనార్హం.
TG: మార్చిలో కురిసిన అకాల వర్షాలకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 15,246 మంది రైతులు నష్టపోయినట్లు సమాచారం. వారికి ఎకరాకు రూ.10,000 చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీ ఆమోదం తెలపగానే అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు పంట నష్టం తుది అంచనాలు సిద్ధం చేస్తున్నారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కరన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించారు. తానైతే కరన్‌కు ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటే ఇవ్వనని తేల్చిచెప్పారు. ‘ఆల్‌రౌండర్ అంటే బౌలింగ్‌లోనో, బ్యాటింగ్‌లోనో జట్టును గెలిపించాలి. ఏ విభాగంలోనూ ఆడని ఆటగాడితో ఉపయోగం లేదు’ అని అభిప్రాయపడ్డారు. నిన్న గుజరాత్‌తో ఓడిన మ్యాచ్‌లో కరన్ 19 బంతుల్లో 20 రన్స్ చేశారు. బౌలింగ్‌లో 2 ఓవర్లకు 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు.
AP: ఎండల తీవ్రతకు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్ర డిస్కంల చరిత్రలోనే గరిష్ఠంగా శుక్రవారం విద్యుత్ డిమాండ్ 13,319 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది మార్చి 7న 13,255 మెగావాట్ల డిమాండ్ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండేది. కాగా ప్రస్తుతం రోజుకు విద్యుత్ వినియోగం సగటున 242.65 మిలియన్ యూనిట్లుగా ఉంటోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో 231.65MUలుగా ఉంది.
AP: శాసనసభ, మండలి, లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నేతలు చాలా అరుదు. నెల్లూరు జిల్లా నేతలకూ ఆ ఘనత దక్కింది. బెజవాడ పాపిరెడ్డి MLC(1958-62), అల్లూరు MLA(1967-72), 1972-78 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1984-89 వరకు ఒంగోలు MPగా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1972లో రాజ్యసభకు, 1978లో మండలికి, 1989లో శాసనసభ(వెంకటగిరి)కు, 2సార్లు ఎంపీ(బాపట్ల, నరసరావుపేట)గా పనిచేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: లోక్‌సభ నామినేషన్ల గడువు 25న ముగియనుంది. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. కానీ అధికార కాంగ్రెస్ మాత్రం మరో 3 స్థానాల్లో క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. HYD, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలుమార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లొచ్చినా ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారమెలా చేయాలని కార్యకర్తలు అంటున్నారు.
AP: పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం కానుండగా.. సెలవుల్లో పాఠశాలలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. చట్టం ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 23వ తేదీ ఆఖరి పని దినం కానున్నట్లు తెలిపింది. అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తామని పేర్కొంది.
AP: కడప జిల్లా ఒంటిమిట్టలో నేడు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామ నవమి రోజున కళ్యాణం జరుపుతారు. ఇక్కడ మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండువెన్నెల్లో స్వామివార్ల పెళ్లి వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ ఉత్సవానికి సీఎం జగన్ బదులు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Sorry, no posts matched your criteria.