India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: NDAలో 2 స్థానాలపై సందిగ్ధత కొనసాగుతోంది. దెందులూరు, అనపర్తి స్థానాలపై BJP, TDP మధ్య చిక్కుముడి కొనసాగుతోంది. పొత్తులో BJPకి అనపర్తి సీటు కేటాయించగా.. కమలం గుర్తుపై పోటీ చేయాలని TDP నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు సూచించారు. నల్లమిల్లి అంగీకరిస్తే దెందులూరులో ఇప్పటికే టికెట్ ప్రకటించిన చింతమనేనికి ఇబ్బంది ఉండదు. లేదంటే అనపర్తి TDP తీసుకుని.. BJPకి దెందులూరు కేటాయించే ఛాన్సుంది.
AP: మడకశిరలో అభ్యర్థిని TDP <<13094674>>మార్చింది<<>>. అక్కడ Ex MLA ఈరన్న కుమారుడు సునీల్‌కు టికెట్ ఇవ్వడాన్ని మాజీ MLC తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటు పాడేరులో TDP నేతల మధ్య వర్గ విభేదాలతో కొత్త వ్యక్తి రమేశ్‌ని తొలుత TDP ప్రకటించింది. దీనిపై మాజీ MLA ఈశ్వరి వర్గం భగ్గుమంది. నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉండటంతో తిరిగి ఆమెనే అభ్యర్థిగా నిలబెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో మెరిశారు. కల్కి, రాజాసాబ్ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న ఆయన సౌండ్ ఇంజినీర్ పప్పు కూతురు, కుమారుడి హాఫ్ శారీ, ధోతీ ఫంక్షన్‌కు హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో బ్లాక్ షర్ట్, క్యాప్, గాగుల్స్‌లో మెరిసిపోతూ ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.
SRHపై మ్యాచ్‌లో రిషభ్ పంత్ ప్రదర్శన పట్ల టీమ్ ఇండియా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అతడి ఆటతీరు మునుపటిలా లేకపోవడమే ఇందుక్కారణం. ఫిట్‌నెస్ పరంగానూ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు. పలు షాట్లు ఆడినప్పుడు పంత్ కింద పడిపోతుండటం గమనార్హం. రానున్న టీ20 వరల్డ్ కప్‌నకు అతడిని సెలక్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పంత్ ఎలా ఆడతారోనంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.
AP: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ స్థానాల్లో పాతపట్నం ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు 7 సార్లు, TDP 5, YCP 2సార్లు, స్వతంత్రులు ఒకసారి గెలిచారు. 1996లో జరిగిన బై పోల్‌లో NTR సతీమణి లక్ష్మీపార్వతి ఇక్కడి నుంచి గెలిచారు. 2014,19 పాతపట్నంలో జెండా ఎగరేసిన YCP.. పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. మరోసారి రెడ్డిశాంతిని బరిలోకి దింపింది. TDP తరఫున మామిడి గోవిందరావు పోటీలో నిలిచారు.<<-se>>#ELECTIONS2024<<>>
నిన్నటి మ్యాచులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంచనా తప్పింది. SRH భారీ స్కోరు సాధించినప్పటికీ ఢిల్లీనే గెలుస్తుందని.. మీ అభిప్రాయం ఏంటని ఫ్యాన్స్‌ను ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అయితే మిడిలార్డర్ ఫెయిలవ్వడంతో ఢిల్లీ 199 పరుగులకే ఆలౌటవ్వగా.. సన్‌రైజర్స్ విజయం సాధించింది. దీంతో ఢిల్లీపై SRH పూర్తి ఆధిపత్యం చలాయించిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సన్‌రైజర్స్‌కు అభినందనలు తెలిపారు.
AP: నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ 4 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. మడకశిర- ఎమ్మెస్ రాజు, ఉండి- రఘురామకృష్ణరాజు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకి అవకాశం కల్పించింది. కాసేపట్లో అభ్యర్థులకు టీడీపీ చీఫ్ చంద్రబాబు బీఫాంలు అందజేయనున్నారు. నామినేషన్లకు ముందు ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
సీయూఈటీ-యూజీ 2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మే 15 నుంచి మే 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TG: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచార హోరు పెంచనుంది. ఈ నెల 25న నామినేషన్ల పర్వం ముగియగానే జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచార కార్యక్రమాలకు, బహిరంగ సభలకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
AP: ఉండి నియోజకవర్గ TDP MLA అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండి MRO ఆఫీసులో రేపు ఉ.10.30 గంటలకు తాను నామినేషన్ వేస్తానని RRR ట్వీట్ చేశారు. ఇందుకోసం పెదఅమిరంలోని స్వగృహం నుంచి భారీ ర్యాలీగా MRO ఆఫీసుకు బయల్దేరనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొనాలని RRR కోరారు. కాగా తొలుత ఉండి టికెట్ సిట్టింగ్ MLA రామరాజుకు కేటాయించిన CBN.. చివరకు RRRకు ఫైనల్ చేశారు.
Sorry, no posts matched your criteria.