news

News April 21, 2024

బ్లూవేల్ ఛాలెంజ్‌కు USలో ఇండియన్ బలి?

image

ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘బ్లూవేల్’ గేమ్ మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలో ఇటీవల ఓ భారత విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. దీనికి బ్లూవేల్ ఛాలెంజే కారణమని అక్కడి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ విద్యార్థి రెండు నిమిషాలపాటు ఊపిరి బిగపట్టినట్లు సమాచారం. ఈ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

News April 21, 2024

బ్లూవేల్ ఛాలెంజ్ అంటే ఏమిటి?

image

ఇది ఒక ఆన్‌లైన్ గేమ్. మొదటగా రష్యాలో మొదలైంది. ఈ గేమ్‌లో 50 రోజులపాటు 50 రకాల ఛాలెంజ్‌లు పూర్తి చేయాలనే టార్గెట్ ఉంటుంది. అర్ధరాత్రి లేవడం, భయానక వీడియోలు చూడటంతోపాటు పలు రకాల సాహసాలను లైవ్‌లో ప్రదర్శించాలి. చివరికి తీవ్రత పెంచి ఆత్మహత్య చేసుకోవాలనే టాస్క్ కూడా ఉండొచ్చు. 2015లో ఓ టీనేజర్ సూసైడ్ తర్వాత పలు దేశాలు ఈ గేమ్ నెట్‌వర్క్‌ను క్లోజ్ చేశాయి. ఇప్పుడు మరోసారి ఈ గేమ్ వెలుగులోకి వచ్చింది.

News April 21, 2024

వేమన నీతి పద్యం- భావం

image

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: నిండుగా ఉన్న నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. చిన్న వాగులు అతి వేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అలాగే యోగ్యుడు, మంచివాడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు మాత్రం అధికంగా మాట్లాడతాడు.

News April 21, 2024

24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

image

TG: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 24 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ రోజున మిర్యాలగూడలో రోడ్‌షో నిర్వహిస్తారు. 17 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. మే 10న సిద్దిపేటలో ప్రచారానికి ముగింపు పలకనున్నారు.

News April 21, 2024

ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు

image

1910: ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ మరణం
1938: ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ మరణం
1939: తెలుగు రంగస్థల నటుడు భాను ప్రకాశ్ జననం
2000: బాలీవుడ్ నటి నిగర్ సుల్తానా మరణం
2013: గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం
2022: రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావు మరణం
నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం

News April 21, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 21, 2024

బాంబుల నుంచి గులకరాయికి రావడం మంచిదే: నారాయణ

image

AP: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు వేశారు. ‘బాంబు దాడుల నుంచి గులకరాయికి రావడం మంచిదే. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లకు కట్టుతో తిరిగారు. ఇక్కడ సీఎం జగన్ తలకు కట్టుకున్నారు. ప్రజలకు గులకరాయి కథలు తెలుసు. ఇప్పుడు మరణవార్త అని చెప్పినా ఎవరూ నమ్మబోరు. రాయి వేసిన వారిని కాకుండా పోలీసులు మరొకరిని ఇరికించాలని చూస్తున్నారు’ అని విమర్శించారు.

News April 21, 2024

భారత్-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ ఆడాలి: అఫ్రీదీ

image

భారత్‌-పాక్ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లు ఆడితే బాగుంటుందన్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యలపై పాక్ మాజీ క్రికెటర్ అఫ్రీదీ స్పందించారు. ‘రెండు దేశాల మధ్య సిరీస్ గురించి రోహిత్ చాలా మంచి అభిప్రాయం చెప్పారు. ఈ దేశాల విషయంలో క్రికెట్‌‌ది కీలక పాత్ర. మ్యాచులు జరిగితే బంధం మెరుగవుతుంది. చక్కటి బంధం మన హక్కు’ అని స్పష్టం చేశారు. భారత్-పాక్ మధ్య చివరిగా టెస్టు సిరీస్ 16ఏళ్ల క్రితం జరిగింది.

News April 21, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 21, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 21, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:41
సూర్యోదయం: ఉదయం గం.5:56
జొహర్: మధ్యాహ్నం గం.12:15
అసర్: సాయంత్రం గం.4:42
మఘ్రిబ్: సాయంత్రం గం.6:34
ఇష: రాత్రి గం.07.49
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.