India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ విజృంభించి ఆడారు. 32 బంతుల్లో 89 రన్స్‌తో వీరవిహారం చేసి ఔటయ్యారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సులు, 11 ఫోర్లున్నాయి. హెడ్ విధ్వంసం ముందు ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. కాగా ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో హెడ్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. మరోవైపు ధాటిగా ఆడిన హెడ్, అభిషేక్‌ను కుల్దీప్ వెనక్కి పంపారు. 10 ఓవర్లకు SRH స్కోర్ 158/4.
కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమని డాక్టర్లు సూచించలేదని తిహార్ జైలు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్య స్థితిపై LGకి రిపోర్ట్ అందించారు. అరెస్ట్ సమయంలో ఆయన కేవలం మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ మాత్రమే తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్ సూచనతో కొన్ని నెలల క్రితం తాను ఇన్సులిన్ తీసుకోవడం మానేసినట్లు జైల్లో వైద్యులతో ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా లేవన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లోనే 46 రన్స్ చేసి ఔటయ్యారు. 6 సిక్సులు, 2 ఫోర్లతో చెలరేగారు. అతను అవుట్ అయిన బంతికి ఫోర్ వెళ్లి ఉంటే ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయ్యుండేది. కానీ త్రుటిలో అతను ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 రికార్డు RR ప్లేయర్ జైస్వాల్ (13 బంతులు) పేరిట ఉంది.
ఢిల్లీతో మ్యాచ్‌లో SRH ఓపెనర్లు బీభత్సం సృష్టించారు. ముకేశ్ కుమార్ వేసిన 6వ ఓవర్‌లో హెడ్ వరుసగా 4,4,4,4,0,6 రన్స్ చేసి.. ఆ ఓవర్‌లో ఏకంగా 22 రన్స్ రాబట్టారు. SRH ఓపెనర్ల ఊచకోతకు ఢిల్లీ ప్లేయర్లకు నేలచూపులు తప్ప ఇంకేం మిగల్లేదు. ప్రస్తుతం SRH స్కోరు 6 ఓవర్లకు 125/0గా ఉంది. హెడ్(84*), అభిషేక్ శర్మ(40*) క్రీజులో ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించింది. పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. 6 ఓవర్లలో ఏకంగా 125 రన్స్ చేసింది. ఢిల్లీతో మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్లు హెడ్(84*), అభిషేక్(40*) ఈ ఘనత సాధించారు. గతంలో ఈ రికార్డు KKR పేరిట ఉంది. 2017లో ఆ టీమ్ RCBపై 105 రన్స్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును SRH బద్దలుకొట్టింది.
AP: కడప లోక్‌సభలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. కడప లోక్‌సభ స్థానానికి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. శివశంకర్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి జైభీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో నిలిచారు.
AP: నెల్లూరు MP అభ్యర్థి వేమిరెడ్డి, ఆయన భార్య కోవూరు TDP అభ్యర్థి ప్రశాంతిల ఆస్తులు రూ.715 కోట్లు
➥ పారిశ్రామిక వేత్త, ఒంగోలు TDP MP అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చరాస్తులు రూ.4,58,40,319, స్థిరాస్తులు రూ.1.09 కోట్లు. చేతిలో ఉన్న నగదు రూ.18529.. భార్య పేరుతో చరాస్తులు రూ.17,96,70,139, స్థిరాస్తులు రూ.30,04,44,600.
➥కావలి TDP అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి ఆస్తి రూ.153.27 కోట్లు. కారు లేదు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ని పునరుద్ధరిస్తామన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన ఎన్నికల బాండ్లను తిరిగి తెస్తామని ఎలా అంటారని దుయ్యబట్టారు. ఇప్పటికే ‘పే పీఎం స్కామ్’ కింద రూ.4లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న BJPకి ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వరని అన్నారు.
ఢిల్లీతో మ్యాచులో SRH ఆటగాళ్ల విధ్వంసం మొదలైంది. తొలి ఓవర్‌లో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరుచుకుపడ్డారు. తొలి బంతి వదిలేసిన అతడు.. తర్వాతి 3 బంతుల్లో 6,4,4 బాదారు. 5వ బంతికి సింగిల్ తీశారు. 6వ బంతిని అభిషేక్ శర్మ బౌండరీకి తరలించారు. దీంతో ఫస్ట్ ఓవర్‌లోనే 19 రన్స్ వచ్చాయి. రెండో ఓవర్‌లోనూ చితకబాదిన హెడ్.. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టారు. అభిషేక్ ఓ ఫోర్ కొట్టడంతో 2 ఓవర్లలోనే 40 రన్స్ వచ్చాయి.
AP: రాజానగరంలో BJP, JSP ఉమ్మడి ప్రచార సభలో CM జగన్‌పై పురందీశ్వరి విమర్శలు గుప్పించారు. ‘ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని జగన్ అంటున్నారు. కానీ ఫ్యాన్ స్పీడ్ 1,2,3 లేదా నాలుగులోనే ఉండాలి. మనం దాన్ని 151లో పెట్టాం. దీంతో మన ఇంటి పైకప్పు లేచిపోయింది. గోడలు కూలిపోయాయి. ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి’ అని పిలుపునిచ్చారు. జగన్‌కు అధికారం ఇస్తే తల లేని మొండెంలా APని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.