news

News April 19, 2024

ఈ జిల్లాల్లో భారీ వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అటు నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో వడగండ్ల వాన పడుతోంది.

News April 19, 2024

కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర: ఆప్

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కోర్టులో ఆరోపించింది. ‘డయాబెటిస్‌తో బాధపడుతున్న ఆయనకు రోజుకు రెండుసార్లు ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మేమెంత రిక్వెస్ట్ చేసినా అధికారులు తగినంత డోసు ఇన్సులిన్ ఇవ్వడం లేదు’ అని ఆరోపించింది. ఆయనకు తగిన వైద్యం అందేలా చూడాలని కోర్టును కోరింది. కాగా.. కేజ్రీ కావాలనే షుగర్ పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

News April 19, 2024

KCR బస్సుయాత్ర షెడ్యూల్ ఖరారు

image

BRS చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10 వరకు ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ఈసీ వికాస్ రాజ్ కూడా అనుమతి మంజూరు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3 లేదా 4 రోడ్ షోలు ఉండనున్నాయి. రోడ్ షోలు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. సిద్దిపేట్, వరంగల్ వంటి ప్రాంతాల్లో బహిరంగ సభలు కూడా ఉండనున్నాయి.

News April 19, 2024

గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల

image

TG: తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 11న ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. సైట్: https://tgcet.cgg.gov.in

News April 19, 2024

జూన్ 1న ఎగ్జిట్ పోల్స్‌

image

ఎన్నికల పోలింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరిలో ఆసక్తిని కలిగిస్తాయి. తుది ఫలితాలకు ముందు విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్‌పై భారీగా అంచనాలు ఉండటంతో వీటికి ప్రాధాన్యం పెరిగింది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఇవాళ మొదలైంది. జూన్ 1తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. అదే రోజు సా.6.30 నుంచి ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడిస్తాయి. జూన్ 4న తుది ఫలితాలు వెలువడుతాయి.

News April 19, 2024

హసన్: అప్పుడు తాతలు.. ఇప్పుడు మనవళ్లు ప్రత్యర్థులు

image

కర్ణాటకలోని హసన్ MP స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది మాజీ PM దేవెగౌడ కుటుంబానికి కంచుకోట. ఇలాంటి చోట ఆయనను మాజీ మంత్రి పుట్టస్వామి గౌడ 1999లో తొలిసారి ఓడించారు. ఈసారి వారి మనవళ్లు ప్రజ్వల్(JDS), శ్రేయస్(INC) బరిలో దిగుతున్నారు. దీంతో పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హోళెనరసిపుర MLA స్థానంలో శ్రేయస్ 3వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 19, 2024

IPL: అత్యధిక పరుగులు, వికెట్లు ఎవరివంటే…

image

ఈ సీజన్‌ ఐపీఎల్‌‌లో బ్యాటర్లలో ఆర్సీబీ క్రికెటర్ కోహ్లీ 361 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. RR ఆటగాడు పరాగ్ 2వ స్థానంలో(318), ముంబై స్టార్ రోహిత్ మూడో ప్లేస్(297)లో ఉన్నారు. SRH స్టార్ క్లాసెన్ 7వ స్థానంలో(253) కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో బుమ్రా 13 వికెట్లతో టాప్ ప్లేస్‌లో, చాహల్(12) రెండో స్థానంలో, ముంబై బౌలర్ కొయెట్జీ(12) 3వ స్థానంలో ఉన్నారు. SRH కెప్టెన్ కమిన్స్ 9 వికెట్లతో 9వస్థానంలో ఉన్నారు.

News April 19, 2024

UAEలోని భారత ఎంబసీ కీలక సూచనలు

image

యూఏఈలోని భారత ఎంబసీ భారత ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు లేదా దుబాయ్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అత్యవసరం కాని పక్షంలో ప్రయాణాల్ని రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. అక్కడ వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి చక్కబడే వరకు తమ సూచనల్ని అనుసరించాలని తెలిపింది. అవసరమైనవారికి సహాయం కోసం దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

News April 19, 2024

డాక్టర్ Vs డాక్టరేట్.. పూతల’పట్టు’ ఎవరిదో!

image

చిత్తూరు(D)లోని SC రిజర్వుడు స్థానం పూతలపట్టు. 2008లో సెగ్మెంట్ ఏర్పడగా.. 2009లో కాంగ్రెస్, 2014, 19లో YCP గెలుపొందాయి. ఇక్కడ మాజీ MLA, వైద్యుడు సునీల్ కుమార్‌ను YCP పోటీకి దించింది. 2009 నుంచి TDP తరఫున 3సార్లు పోటీ చేసి లలిత కుమారి ఓడిపోగా.. ఈసారి డా.మురళీ మోహన్‌‌(TDP) బరిలో ఉన్నారు. YCP టికెట్ దక్కని సిట్టింగ్ MLA బాబు కాంగ్రెస్‌లో చేరి పోటీలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 19, 2024

డబ్బుల కోసమే లైంగిక ఆరోపణలు: నటుడి భార్య

image

నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ తన భర్త అని చెప్పుకుంటున్న <<13064583>>అపర్ణ<<>> ఠాకూర్ అనే మహిళపై ఎంపీ భార్య ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రవికిషన్ నుంచి రూ.20 కోట్లు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు రేప్ కేసుతో తన భర్తను బెదిరిస్తోందని తెలిపారు. ఆమె ఫిర్యాదుతో అపర్ణ, ఆమె కూతురు షెనోవా, కుమారుడు సోనక్, భర్త రాజేశ్‌పై కేసు నమోదైంది.