News April 19, 2024
IPL: అత్యధిక పరుగులు, వికెట్లు ఎవరివంటే…
ఈ సీజన్ ఐపీఎల్‌లో బ్యాటర్లలో ఆర్సీబీ క్రికెటర్ కోహ్లీ 361 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. RR ఆటగాడు పరాగ్ 2వ స్థానంలో(318), ముంబై స్టార్ రోహిత్ మూడో ప్లేస్(297)లో ఉన్నారు. SRH స్టార్ క్లాసెన్ 7వ స్థానంలో(253) కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో బుమ్రా 13 వికెట్లతో టాప్ ప్లేస్‌లో, చాహల్(12) రెండో స్థానంలో, ముంబై బౌలర్ కొయెట్జీ(12) 3వ స్థానంలో ఉన్నారు. SRH కెప్టెన్ కమిన్స్ 9 వికెట్లతో 9వస్థానంలో ఉన్నారు.
Similar News
News September 10, 2024
అప్పుడు.. రిజర్వేషన్ల రద్దుపై ఆలోచిస్తాం: రాహుల్ గాంధీ
భారత్ ‘ఫెయిర్ ప్లేస్’గా మారాక కాంగ్రెస్ రిజర్వేషన్ల రద్దుపై ఆలోచిస్తుందని LoP రాహుల్ గాంధీ USలో అన్నారు. ‘90% ఉన్న OBC, దళిత, ఆదివాసీలకు సరైన ప్రాతినిధ్యమే లేదు. టాప్-10 వ్యాపారాలు, మీడియా పరిశ్రమ, బ్యూరోక్రాట్లు, అత్యున్నత కోర్టుల్లో వెనకబడిన వర్గాల వారు కనిపించరు. అందుకే కులగణన అవసరం. ఈ కులాల వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకొనేందుకు సోషియో ఎకనామిక్ సర్వే సైతం చేపట్టాలి’ అని ఆయన అన్నారు.
News September 10, 2024
వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం: మంత్రి నారాయణ
AP: విజయవాడ వరద బాధితులకు త్వరలో నష్టపరిహారం అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. 1.7లక్షల మందికి నిత్యావసర సరుకులు అందించామని, ఆస్తి నష్టంపై సర్వే జరుగుతోందని చెప్పారు.
News September 10, 2024
ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే వేదికపైకి తారక్, అల్లు అర్జున్?
ఈరోజు జరిగే ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారనే చర్చ నడుస్తోంది. తారక్, బన్ని ‘బావ’ అని ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ ఈవెంట్‌కు బన్ని రానున్నారని సమాచారం. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పాటలు హిట్ అయిన తరుణంలో ట్రైలర్‌పైనా భారీ అంచనాలున్నాయి.