India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రేపటి నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎల్లుండి కర్ణాటకలో ప్రచారం చేస్తారు. 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.
TS: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈనెల 30న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఆ జాబితానే పోలింగ్‌కు ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే అందులో ఓటు హక్కు ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 30న ఓటుహక్కు పొందుతారు. రాష్ట్రంలో 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నట్లు ఫిబ్రవరిలో ఈసీ ప్రకటించింది.
<<-se>>#Elections2024<<>>
‘ఎందుకు నటించానా?’ అని ఫీలైన చిత్రం కబీర్‌సింగ్ అని కామెంట్ చేసిన అదిల్ హుస్సేన్‌పై డైరెక్టర్ సందీప్‌రెడ్డి Xలో ఫైరయ్యారు. ‘మీరు నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఈ బ్లాక్‌బస్టర్‌తో వచ్చింది. దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు బాధ పడుతున్నా. ఇకపై మీరు సిగ్గుపడకుండా ఆ మూవీలో మీ ఫేస్‌ను AIతో మార్చేస్తా’ అని పేర్కొన్నారు. కాగా ఆ చిత్రంలో కాలేజ్ డీన్‌గా అదిల్ నటించారు.
AP: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో రాష్ట్రానికి రానున్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట లేదా కడపతో పాటు మరో నియోజకవర్గంలోనూ ఆయన పాల్గొంటారు. ప్రధానితోపాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా సభల్లో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా మోదీ పర్యటన తేదీలు ఇంకా షెడ్యూల్ చేయాల్సి ఉంది.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 21న తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేయనున్నారు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు స్వయంగా అందిస్తారు. ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకట్రెండు రోజుల్లోనే తేల్చేయనున్నారు. కాగా ఇవాళ ఆయన పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
AP: ఆ ఊరు ప్రజాప్రతినిధులకు పుట్టినిల్లు. ఐదుగురు ఎమ్మెల్యేలను శాసనసభకు పంపింది. అదే కర్నూలు(D) ఆలూరు(M) మొలగవల్లి. 1957లో పత్తికొండ నుంచి లక్ష్మీనారాయణ రెడ్డి(CPI), 1962లో లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు MLAగా ఏకగ్రీవంగా గెలిచారు. 1987లో ఎం.రంగయ్య, 1989లో లోక్‌నాథ్(కాంగ్రెస్), 1994లో కె.రామకృష్ణ(ప్రస్తుత CPI రాష్ట్ర కార్యదర్శి) అనంతపురం నుంచి గెలుపొందారు. వీరంతా మొలగవల్లికి చెందిన వారే.
<<-se>>#ELECTIONS2024<<>>
ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ హత్యకు కుట్ర పన్నారని, చంపాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీశ్ పదునైన రాయితో దాడి చేశాడని పేర్కొన్నారు. అదృష్టవశాత్తు సీఎంకు పెద్ద గాయం కాలేదని తెలిపారు. కాల్ డేటా, సీసీ ఫుటేజీ ఆధారాలతో ఈ నెల 17న నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు.
రైడ్ ఛార్జీ కంటే అదనంగా ₹27 వసూలు చేసిన ‘ఉబర్’కు వినియోగదారుల కోర్టు ₹28,000 జరిమానా విధించింది. ఇందులో ప్రయాణికుడికి ₹27తోపాటు ₹5వేల పరిహారం, ఖర్చుల కింద మరో ₹3వేలు చెల్లించాలంది. 2022 SEP 19న రిత్విక్‌గార్గ్(పంజాబ్) ఉబర్‌లో రైడ్ బుక్ చేసుకున్నాడు. ఛార్జీ రూ.53 చూపించగా, డ్రైవర్ రూ.80 వసూలు చేశాడు. దీనిపై ప్రయాణికుడు కంపెనీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో అతను కోర్టును ఆశ్రయించాడు.
AP: కర్నూలు పార్లమెంట్ వదిలి డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘గత్యంతరం లేక కాంగ్రెస్‌ను వదిలి టీడీపీలో చేరా. ఇక ఆ పార్టీలోనే జీవితాంతం ఉంటా. ఇష్టం లేకుండానే డోన్ నుంచి పోటీ చేస్తున్నా’ అని చెప్పారు. మధ్యలో భావోద్వేగానికి గురై ప్రసంగాన్ని ఆపేసి కుర్చీలో కూర్చున్నారు.
TG: తన కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై BRS అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. ‘ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో BL.సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి మోదీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్టు చేయించి జైలుకు పంపారు. మోదీ దుర్మార్గుడు’ అని కేసీఆర్ విమర్శించారు.
Sorry, no posts matched your criteria.