News April 18, 2024

ఇష్టం లేకుండానే డోన్ నుంచి పోటీ చేస్తున్నా: కోట్ల సూర్యప్రకాశ్

image

AP: కర్నూలు పార్లమెంట్ వదిలి డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘గత్యంతరం లేక కాంగ్రెస్‌ను వదిలి టీడీపీలో చేరా. ఇక ఆ పార్టీలోనే జీవితాంతం ఉంటా. ఇష్టం లేకుండానే డోన్ నుంచి పోటీ చేస్తున్నా’ అని చెప్పారు. మధ్యలో భావోద్వేగానికి గురై ప్రసంగాన్ని ఆపేసి కుర్చీలో కూర్చున్నారు.

Similar News

News September 11, 2024

ఇడ్లీ, దోసె పిండిని ఎన్ని రోజులు వాడొచ్చు?

image

ఇడ్లీ, దోసె పిండిని కొందరు వారంపాటు ఫ్రిజ్‌లో దాచుకుని వాడతారు. ఆ పిండిని రోజుల తరబడి ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని రోజులు ఫ్రిజ్‌లో పెడితే అతిగా పులుస్తుంది. దానిని తింటే కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఎక్కువగా పులిసిన పిండిని బయటపడేయాలి. ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే వాడాలి. తాజాగా తింటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం.

News September 11, 2024

ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు

image

ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. రేపు అనంతపురంలో ఇండియా-డితో జరగబోయే మ్యాచ్‌లో రషీద్ బరిలోకి దిగనున్నారు. కాగా రషీద్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్నారు.

News September 11, 2024

వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్: ఏది బెటర్?

image

చాలామంది వైట్ ఎగ్ కన్నా బ్రౌన్ ఎగ్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. ధర ఎక్కువైనా వాటినే కొంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. పెంకు రంగులోనే తేడా ఉంటుందని, రెండు గుడ్లలోనూ సమాన పోషకాలు ఉంటాయన్నారు. పెంకు రంగు మారటం వల్ల రుచి, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. బ్రౌన్ ఎగ్ పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. వాటిని పెంచేందుకు ఖర్చు ఎక్కువ కావటంతో ఆ గుడ్లను అధిక ధరకు విక్రయిస్తారు.