India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సుప్రీంకోర్టులో ఇవాళ ఓటుకు నోటు కేసుపై విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌పై ధర్మాసనం వాదనలు విననుంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఎరవేశారన్న కేసులో చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది.
TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడికి బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 23న ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుదలవుతున్న నేపథ్యంలో 23 లేదా 24వ తేదీలోగా ఇంటర్ ఫలితాలను బోర్డు వెల్లడించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.
AP: కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలను గెలిపించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత అభ్యర్థించారు. షర్మిలను కడప ఎంపీగా చూడాలన్నదే వివేకా చివరి కోరిక అని.. దాన్ని నెరవేర్చేందుకు సన్నద్ధమయ్యానని తెలిపారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఈ నెల 20వ తేదీన షర్మిల ఎంపీగా నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.
తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి UPలోని జౌన్‌పుర్ BSP MP అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ MP ధనుంజయ్ సింగ్ మూడో భార్య. వివిధ కేసుల్లో ఆయనకు శిక్షపడటంతో భార్యను బరిలో నిలిపారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గతంలో హుజూర్‌నగర్‌లో స్వతంత్ర MLAగా గెలిచారు. తల్లి లలితారెడ్డి సర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీల కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. శ్రీకళారెడ్డి పేరిట రూ.780 కోట్ల ఆస్తులున్నాయి.
ED గత పదేళ్లలో దూకుడు పెంచింది. మన్మోహన్ పాలనలో 1,797 కేసులు నమోదు కాగా.. మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా 5,155 కేసులు నమోదయ్యాయి. అప్పుడు 29మందిని అరెస్టు చేస్తే ఈ పదేళ్లలో 755మందిని అరెస్టు చేసింది. మోదీ పాలనలో రూ.1,21,618కోట్ల ఆస్తులను జప్తు చేసింది. యూపీఏ హయాంతో పోల్చితే ఎన్డీయే పాలనలో 86రెట్లు ఈడీ సోదాలు నిర్వహించింది. 2005లోనే PMLA అమల్లోకి వచ్చినా.. శిక్షలు మాత్రం 2014 నుంచే మొదలయ్యాయి.
TG: గంజాయి రూపం ఊసరవెల్లి రంగులు మారినట్లు మారుతోంది. దీనిపై పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. గంజాయిని హ్యాష్ ఆయిల్, చాక్లెట్లుగా మార్చే ట్రెండ్ పోయి పౌడర్ చేసి అమ్ముతున్నారు. దీన్ని పాలల్లో కలుపుకుని తాగుతారట. జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా దుకాణంలో సైబరాబాద్ పోలీసులు పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి.
దేశంలో నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, బెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు, ఏపీ, బిహార్‌లో అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతి పెద్ద విజయం. అంతకుముందు 2022లో పంజాబ్ కింగ్స్‌పై 57 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అలాగే ఈ సీజన్‌లో బంతులపరంగా అతి పెద్ద విజయంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది.
ఎన్నికల్లో భాగంగా రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందులో 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ CMలు, ఓ మాజీ గవర్నర్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నితిన్ గడ్కరీ-నాగ్‌పుర్, సర్బానంద సోనోవాల్-దిబ్రూగఢ్, సంజీవ్ బలియాన్-ముజఫర్‌నగర్, అర్జున్ మేఘ్‌వాల్-బికనేర్, జితేంద్రసింగ్-ఉధమ్‌పుర్, కిరణ్ రిజుజు, నబం తుకి-అరుణాచల్ పశ్చిమ, బిప్లబ్ కుమార్-త్రిపుర పశ్చిమ, తమిళిసై-చెన్నై దక్షిణ నుంచి బరిలో ఉన్నారు.
రుద్రమ దేవి సినిమాలో గోన గన్నారెడ్డి(అల్లు అర్జున్) చెప్పిన ‘ఆడా ఉంటా.. ఈడా ఉంటా’ డైలాగ్ పాపులర్. అచ్చం అలాగే కొమురంభీం జిల్లా కెరమెరి మండల ఓటర్లకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి ఓటరు కార్డులు మంజూరయ్యాయి. దీంతో వీరు రెండు చోట్లా ఓట్లు వేస్తుంటారు. మహారాష్ట్రలో మొదటి విడత పోలింగ్ ఈ నెల 19న ఉంది. ఈనేపథ్యంలోనే సదరు ఓటర్లు ఏదైనా ఒకచోటే ఓటు వేయాలని ఎన్నికల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. <<-se>>#Elections2024<<>>
Sorry, no posts matched your criteria.