News April 18, 2024
షేక్.. గంజాయి మిల్క్ షేక్!

TG: గంజాయి రూపం ఊసరవెల్లి రంగులు మారినట్లు మారుతోంది. దీనిపై పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. గంజాయిని హ్యాష్ ఆయిల్, చాక్లెట్లుగా మార్చే ట్రెండ్ పోయి పౌడర్ చేసి అమ్ముతున్నారు. దీన్ని పాలల్లో కలుపుకుని తాగుతారట. జగద్గిరిగుట్టలోని ఓ కిరాణా దుకాణంలో సైబరాబాద్ పోలీసులు పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి.
Similar News
News July 10, 2025
GPO రెండో విడత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TG: గ్రామ పాలన అధికారుల(GPO) భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. 10,954 పోస్టుల భర్తీకి మార్చి 29న మొదటి నోటిఫికేషన్ రాగా 3,550 మంది ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ గతంలో వీఆర్ఏ, వీఆర్వోలుగా చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 16లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న GPO పరీక్ష నిర్వహించనున్నారు.
News July 10, 2025
BREAKING: ఢిల్లీలో భూకంపం

దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. 15 సెకన్లపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
News July 10, 2025
ఛంగూర్ బాబా: సైకిల్ నుంచి రూ.100 కోట్ల ఆస్తి!

UPలో అనధికార మత మార్పిడులకు పాల్పడుతున్న ఛంగూర్ బాబా కేసు వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడికి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నట్లు, 40 బ్యాంకు ఖాతాలు, రూ.106 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాబా గతంలో సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయిత్తులు అమ్ముకునేవాడు. అతడు బలరాంపూర్(D) రెహ్రా మాఫీలో ఓ భారీ భవనం నిర్మించుకోగా యోగి సర్కార్ బుల్డోజర్లతో కూల్చివేసింది.